విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ తరుపున ట్రస్ట్ టీచర్ కె అరుణ ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు/అధ్యక్షులు అయిన గాంధీ నాగరాజన్ భవాని పురం నేతాజీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీ నాగరాజన్ మాట్లాడుతూ ప్రతి స్త్రీ లో భయాలను పోగొట్టుకోవాలంటే ధైర్యవంతులైన మహిళల ఆలోచనలను, సింద్ధాంతాలను అనుసరించాలని, అప్పుడే ప్రతి స్త్రీ గౌరవించబడతారు, గుర్తించబడతారని, ఎంతో మంది స్త్రీ మూర్తులు సమాజములో అభివృద్ధి చెందడానికి మార్గం నిర్దేశించబడుతుంది. అలాంటి స్త్రీల మనోభావాలు , ఉన్నత మనస్సు, లక్షణాలు, లక్ష్యాలు ఉన్న స్త్రీల ఎదుగుదల ఈ దేశ రక్షణకు ఎంతో అవసరం. వేల సంవత్సరాల నుండి స్త్రీల బానిసత్వం పోవటానికి ఎంతో మంది కృషి చేసారు. సతిసహగమనం వంటి దురాచారం పోయి స్వేచ్ఛ స్వాతంత్ర్యం అనుభవిస్తున్నామని, అన్ని రంగాలలో స్త్రీలు 67% రిజర్వేషన్లు పొంది శక్తి వంతముగా ఎదిగినపుడే నిజమైన స్వాతంత్ర్యo పొందినట్టు. ప్రతి వ్యక్తి లోను , ప్రతి వ్యక్తి కలలోను నిజమైన స్వాతంత్ర్య జ్యోతి వెలగాలని, స్త్రీ రక్షనే స్వాతంత్ర్య లక్ష్యం అని.. LIVE FOR COUNTRY..DIE FOR COUNTRY అనే నినాదం తో ప్రజాస్వామ్య పరి రక్షణకు ముందు అడుగు వేస్తూ బ్రతుకుదాం బ్రతికిద్దాం బ్రతికించడానికై బ్రతుకుదాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు వివిధ పోటీలలో బహుమతులు అందించారు. గాంధీ దేశం ట్రస్ట్ తరుపున ప్రధాన బహుమతి గా వెండి ప్లేట్ ని 43 వ డివిషన్ కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి స్కూల్ కి అందించారు. స్పెషల్ బహుమతిని ఎ.పి స్టేట్ మహిళ అధ్యక్షురాలు బి. భారతి అందించారు. ఈ కార్యక్రమానికి నిర్వాహణ డి. ప్రణవ్ జైసూర్య చేయగా.. కె.సౌజన్య, ఎమ్.శ్రీదేవి, ఆర్. అపర్ణ, మాస్టర్ కార్తీ, వి. రమేష్, ఎల్. శ్రీను, మరియు మహిళా సేవకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News