
పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 12వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా పెనమలూరు గ్రామంలో నియోజకవర్గ శాసనసభ్యులు కొలుసు పార్థసారధి నాయకత్వంలో ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్ పర్సన్ తాతినేని పద్మావతి టి కె ఆర్ ల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ మరియు కేక్ కటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సలహా మండలి సభ్యుడు కొడాలి శ్రీధర్ సీనియర్ నాయకులు విజయ్ కుమార్ మరీదు మాట్లాడుతూ జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాలు అర్హులైన ప్రతి లబ్ధిదారులకు పథకాలు అందే విధముగా ప్రతి నాయకుడు కృషి చేయాలని కోరారు. 2024లో వైయస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎంగా చేయాలని ప్రతి కార్యకర్త కృషి చేయాలని సైనికులు లాగా పనిచేయాలని కోరారు. పెనమలూరు మండల అధ్యక్షులు కిలారు శ్రీనివాసరావు, కాటూరి నాని, నేలపాటి కోటేశ్వరరావు, పార్టీ నాయకులు డి వి ఎఫ్ కృష్ణా, జిల్లా అధ్యక్షులు తాళ్లూరు అజయ్ కుమార్, ఫిషర్ మెన్ జిల్లా అధ్యక్షుడు అండ్ రాజు శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు సాంబశివరావు, పటమట కోటి, ఆటో కార్మిక యూనియన్ నాయకులు కుమార్, మీనాకుమారి, రాణి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News