
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ తొమ్మిదవ ఆవిర్భావ సభను పురస్కరించుకొని పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం వద్ద గురువు .మదన్ కుమార్ ,వల్లంశెట్టి. రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో స్టిక్కర్ల కార్యక్రమానికి నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ హాజరైనారు. పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం వద్ద జనసేన పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన భారీ బెలూన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ఆవిర్భావ సభను విజయవాడ నగరంలోని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు విజయవంతం చేసేందుకు ఇప్పటికే అన్ని రకాలుగా సన్నద్ధమ ఉన్నారని, మార్పు కోసం ఏర్పాటు చేసిన జనసేన పార్టీని ప్రజల ఆశీర్వదించాలని, ఆవిర్భావ సభ తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని, పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్టాలిన్, పోతిన. సాంబశివరావు షేక్.గయసుద్దీన్, శనివారపు. శివ,రాజా నాయుడు,మోబినా,రామ నాయుడు,బావిశెట్టి.శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News