విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమం ధ్యేయం గా పారదర్శకంగా పరిపాలన అందిస్తున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. బుధవారం నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్ లో. పప్పులమిల్లు రోడ్డు, రఘురామ వీధి,పూర్ణచంద్రరావు రోడ్డు ప్రాంతంలో గడప గడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాల్గోవ రోజు జరిగిన కార్యక్రమం లో అవినాష్ ఇంటి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు గురుంచి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏళ్ల కాలంలోనే సంక్షేమ పథకాలు అమలు కు దాదాపు లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు మహిళల ఖాతాలలో జమ చేసిన ఘనత జగనన్న దే అని అన్నారు.తెలుగుదేశం పార్టీ కి బలముంది అని వారు ప్రచారం చేసుకొనే ఈ 12వ డివిజన్ లోనే దాదాపు 6 కోట్ల రూపాయల నిధులతో మెయిన్ రోడ్లు,సీసీ రోడ్లు,సైడ్ డ్రైనేజీ వ్యవస్థ, ఉర్దూ స్కూల్, అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని అన్నారు.రోజురోజుకు ప్రజలలో ముఖ్యమంత్రి కి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్ష టీడీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వాటిని తిప్పికొడుతూ ప్రజలకు వాస్తవాలు వివరించి పార్టీని ప్రజలకి మరింత చేరువ చేయడానికె ఈ గడప గడప వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేపతిన్నట్టు తెలిపారు. అర్హత ఉండి ఏదైనా సాంకేతిక కారణాల వల్ల ఎవరికైనా ఏదైనా పధకం రాకపోతే ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా కల్పించారు. ప్రతి ఇంటిలో ఏ ఏ సంక్షేమ పథకాలు అందజేశారో వారికి సవివరంగా వివరించి పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,ఫ్లోర్ లీడర్ వెంకట సత్యం, స్థానిక వైస్సార్సీపి ఇంచార్జ్ మాగంటి నవీన్,డివిజన్ అధ్యక్షులు రిజ్వాన్ కార్పొరేటర్లు అంబేద్కర్,రామిరెడ్డి,మాధురి,వైస్సార్సీపీ నాయకులు కాళీ,ఖలీమ్,చిన్న,బషీర్,అలా చెల్లారావు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …