విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ రామ నవమి సందర్భంగా విజయవాడ నగరంలో వాడ వాడ లా శ్రీ రామ కళ్యాణ మహోత్సవాలు, అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు భారీ ఎత్తున జరిగాయి. కోవిడ్ కారణంగా, లాక్ డౌన్ పరిస్థితుల వలన గత రెండు సంవత్సరాలుగా శ్రీరామ నవమి కార్యక్రమాలు చేయలేకపోవడంతో ఈ సంవత్సరం శ్రీ రామనవమి వేడుకలు భారీ ఎత్తున జరిగాయి.
శ్రీ నగరాల సీతారామ స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు…
ఒన్ టౌన్ కోమల విలాస్ సెంటర్ వద్ద శ్రీ నగరాల సీతారామ స్వామి శ్రీ మహాలక్ష్మీ అమ్మవార్ల దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో శ్రీ రామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి.శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మీ దంపతులు విచ్చేయగా కమిటీ సభ్యులు సాదరంగా ఆహ్వానించి, దర్శనం అనంతరం కండువా కప్పి సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం సుబిక్షం గా ఉండాలని ఈ ఆలయంలో గత 100 సంవత్సరాలు పైగా ప్రతి శ్రీ రామ నవమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాల కార్యక్రమాలు జరుపుతున్నారని, నగర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో…
ఒన్ టౌన్ , భావన్నారాయణ వీధి లో శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలను ఘనంగా జరిపించారు.ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు కాజ లక్ష్మీ వెంకట మోహన రావు మాట్లాడుతూ గత 63 సంవత్సరాలుగా తమ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలను ఘనంగా జరుపుతున్నామని తెలిపారు. కోవిడ్ కారణంగా 2సంవత్సరాలు ఇక్కడ పూజలు మాత్రమే నిర్వహించామని, ఈ సంవత్సరం భారీ ఎత్తున కళ్యాణ మహోత్సవాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.తమ శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న కల్యాణ మహోత్సవాలకు భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తారని, ఇక్కడ పెళ్లికాని వారు దర్శించుకుంటే త్వరగా పెళ్లి అవుతుందని నమ్మి వస్తారని, అలాగే సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని బక్తులు విశ్వసిస్తున్నారన్నారు.కార్యక్రమంలో కమిటీ ప్రధాన కార్యదర్శి కొమ్మూరి శేఖర్, కార్యదర్శి పట్టెం వెంకటేశ్వరరావు, కమిటీ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

శ్రీ సీతారామ మందిరం లో…
ఒన్ టౌన్, బోడెమ్మ హోటల్ వెనుక శ్రీ సీతారామ మందిరంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగింది.కమిటీ నిర్వాహకులు కె.వెంకట రత్నం మాట్లాడుతూ గత 17 సంవత్సరాలుగా దిగ్విజయంగా శ్రీ రామ నవమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలందరూ సుఖః సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాక్షించారు.ఈ ఆలయంలో దంపతులందరు నిండు నూరేళ్లు వర్థిలాలని సీతారామ కళ్యాణ మహోత్సవా కార్యాక్రమాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.కార్యక్రమంలో కమిటీ సభ్యులు రాంబాబు,ఎమ్. నరసింహారావు, ఎస్ యుగంధర్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
Prajavartha Online Telugu News