Breaking News

ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతులమీదుగా మజ్జిగ చలివేంద్రం ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎండ తీవ్రతల దృష్ట్యా వడదెబ్బ తగలకుండా ప్రజలందరూ తగు జాగ్రత్తలు పాటించాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ప్రకాష్ నగర్ లో మజ్జిగ చలివేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారభించారు. తొలుత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. శరీరంలో నీటి సమతుల్యత కాపాడుకోవడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఇందుకోసం నీటి శాతం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిదన్నారు. వేసవి దృష్ట్యా పాదచారుల దాహార్తి తీర్చేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని.. ఈ చలివేంద్రాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్ అలంపూర్ విజయలక్ష్మి, కో ఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, నాయకులు అలంపూర్ విజయ్, అఫ్రోజ్, నేరెళ్ల శివ, రామిరెడ్డి, నాగయ్య, కోటేశ్వరరావు, వెంకట్, మోహన్ రావు, రాజారెడ్డి, రెడ్డెమ్మ, సుభాని తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *