Breaking News

మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట

-ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే రంజాన్ పండగ మతసామరస్యానికి ప్రతీక అని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. 27 వ డివిజన్ రోకళ్ళపాలెం మహ్మదీయ మసీద్ నందు జరిగిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మత పెద్దలు ఇస్లాం సాంప్రదాయం ప్రకారం వీరిని సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. మత సామరస్యాన్ని పెంపొందించే విధంగా వేడుకలు నిర్వహిస్తున్న నిర్వాహకులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. దైవం పట్ల విధేయతతో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టి నిత్యం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈద్ జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మ‌హ‌నీయుడైన మహ్మద్ ప్ర‌వ‌క్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భ‌వించిన‌ది రంజాన్ మాసంలోనే కావ‌డంతో ముస్లింలు ఈ నెల‌కు అత్యంత ప్రాముఖ్య‌త‌‌నిస్తార‌న్నారు. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు దానధర్మాల ద్వారా ఖర్చు చేస్తూ.. మ‌నిషిలోని చెడు భావాల్ని, అధ‌ర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపేందుకు చేసే కఠోర దీక్షే రంజాన్ ఉపవాస దీక్ష అని ఆయ‌న అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. ఉర్దూ భాషను రాష్ట్రంలో రెండో అధికారిక భాషగా ప్రకటించి.. ముస్లిం మైనార్టీ సబ్ ప్లాన్ కు చట్టబద్ధత కల్పించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందన్నారు. అల్లా దివ్య ఆశీస్సులతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రానున్న రోజుల్లో ప్రజలకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు, సంక్షేమం అందించాలని కాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి బలరాం, నాయకులు బొప్పన గాంధీ, అనిల్, శనగశెట్టి హరిబాబు, కమిటీ అధ్యక్షులు పఠాన్ బాబా ఖాన్, సెక్రటరీ ఖాసీమ్ పీరా, సభ్యులు వాహబ్, గౌస్, ఎండి రసూల్, షేక్ బాజీ, షేక్ గౌస్, మౌలాలి, ముస్లిం మత పెద్దలు, సోదరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *