విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో భూముల రీసర్వే వేగవంతం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు సిసిఎల్ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్‌కు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో గురువారం గొల్లపూడి సిసిఎల్ఏ ప్రధాన కార్యాలయం నుండి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ నుండి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ ఎస్ డిల్లీరావు మాట్లాడుతూ వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంలో భాగంగా రీసర్వే పనులు జిల్లాలో చురుకుగా జరుగుతున్నాయన్నారు. జిల్లాలో తిరువూరు, విస్సన్నపేట, గంపలగూడెం, ఏ కొండూరు, రెడ్డిగూడెం, జగ్గయ్యపేట, కంచికచర్ల మండలాలలోని 115 గ్రామాలలో రిసర్వే లో భాగంగా డ్రోన్ఫైయింగ్ చేపట్టడం జరిగిందని, వీటిలో 17 గ్రామాలలో డ్రోన్ఫైయింగ్ చేయడం జరిగిందన్నారు. వీటిలో కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో గ్రౌండ్ వాలిడేషన్ పూర్తి అయిందన్నారు. 11 గ్రామాలలో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తి చేశామని మిగిలి ఐదు గ్రామాలలో గ్రౌండ్ ట్రూతింగ్ వివిధ దశలలో ఉన్నాయన్నారు. గ్రౌండ్ వాలిడేషన్‌లో భాగంగా ఒక గ్రామం పూర్తి చేశామని 10 గ్రామాలు వివిధ దశలో ఉన్నాయన్నారు. స్పందనలో రెవెన్యూ పరమైన వినతుల పరిష్కారం పై జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు దృష్టి పెట్టాలని సూచించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి స్పందనలో 60 నుండి 70 శాతం వినతులు వస్తున్నాయని వీటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. సమగ్ర భూ సర్వే, భూ రికార్డుల స్వచ్చీకరణ, మ్యూటేషన్ పై సమీక్షించి పలు సూచనలు చేశారు. సమగ్ర భూ సర్వేకు సంబంధించి సర్వే, భూ రికార్డుల కమీషనర్ సిద్ధార్థ జైన్, మ్యూటేషన్లపై బాబు ఏ పలు సూచనలు చేశారు. జగనన్న రెవెన్యూ పరమైన స్పందన వినతుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్‌కుమార్, డిఆర్వో కె.మోహన్‌కుమార్, జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికాడ్స్ కె. సూర్యరావు ఉన్నారు.
Prajavartha Online Telugu News