Breaking News

విద్యా సంస్కరణల అమలుకు కృషి చేయాలి…

-పదో తరగతి పరీక్షలకు తగు ఏర్పాట్లు చేయాలి
-రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం అందరూ కృషి చేయాలని విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విద్యాశాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం గురువారం తొలిసారి సమగ్రశిక్షా రాష్ట్ర కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యాశాఖా ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాశాఖామంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న విద్యా పథకాలన్నింటిని సక్రమంగా అమలు చేయాలని అధికారులను సూచించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖా ప్రత్యేక ముఖ్య కార్యదర్శి  బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యా కమీషనర్ ఎస్.సురేష్ కుమార్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి, తదితర విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.

పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి…
సమీక్షా సమావేశం అనంతరం రాష్ట్రంలో ఈ నెల 27 నుండి మే 9వ వరకు జరిగే పదో తరగతి పరీక్షల నిర్వహణపై వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పదో తరగతి పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అందుబాటులో తాగునీరు, విద్యుత్, టాయిలెట్లు, ఫర్నీచర్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖాధికారులు, పాఠశాల విద్యాశాఖ సలహాదారు (ఇన్ఫ్రా)  ఎ.మురళి, ఆర్టీసీ, వైద్య, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *