-జిల్లాలో 99 శాతం మంది విద్యార్థులు హాజరు
-కలెక్టర్ డా. కె. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం ఉదయం కోటిపల్లి బస్టాండ్ సమీపంలో ఉన్న ప్రభుత్వ బాలికల పాఠశాలల్లో (కేంద్రం 41235,) పరీక్ష ల నిర్వహణ ను జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తూర్పుగోదావరి జిల్లాలో 23864 మంది విద్యార్ధిని, విద్యార్థులు 132 పరీక్షా కేంద్రాల లో పదవ తరగతి పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. తొలిరోజు తెలుగు పరీక్షకి 23909 మంది విద్యార్థులకు గాను .. 23,675 హాజరయ్యారని, 234 మంది పరీక్షకి అబ్సెంట్ అయినట్లు తెలిపారు. ఈ కేంద్రంలో 223 మంది పిల్లలు పరీక్షలు రాయడానికి ఏర్పాట్లు చేసినట్లు అధికారులు కలెక్టర్ కి వివరించారు. తరగతి గదిలో లైటింగ్, త్రాగునీరు తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులతో ఏర్పాట్ల పై కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద త్రాగునీరు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. విద్యార్థుల కోసం ఆర్టీసి ద్వారా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కలుగచేయ్యాడం జరిగిందన్నారు. కలెక్టర్ వెంట డి ఈ ఓ అబ్రహం, పాటశాల ప్రధాన ఉపాధ్యాయురాలు తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News