Breaking News

ఎక్సెల్ ప్లాంట్ ప్రహరీ గోడ నిర్మాణానికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి శంకుస్థాపన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వాంబేకాలనీ గృహ సముదాయాలను గేటెడ్ కమ్యూనిటటీ తరహాలో అభివృద్ధి పరిచేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ఎక్సెల్ ప్లాంట్ చుట్టూ రూ.1 కోటి 29 లక్షల 50 వేల వ్యయంతో చేపట్టిన ప్రహరీ గోడ నిర్మాణానికి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజ రెడ్డిలతో కలిసి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఈ ప్రహరీ గోడ ఎక్సెల్ ప్లాంట్ నుంచి గృహ సముదాయాలను వేరుపరుస్తుందన్నారు. ప్లాంట్ ప్రభావం ఎక్కడా కూడా పరిసర ప్రాంతాలపై పడకుండా.. 1.80 మీటర్ల ఎత్తు, 1,208 మీటర్ల పొడవుతో గోడ నిర్మాణాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. దీంతో పాటు వాతావరణ పరిశుభ్రతకై కాంపౌండ్ వాల్ ఆనుకుని మొక్కలను పెంచడం జరుగుతుందన్నారు. పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. కార్యక్రమంలో వైసీపీ డివిజన్ కోఆర్డినేటర్ బెవర నారాయణ, నాయకులు అవుతు శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి వెంకట్రావు, బత్తుల దుర్గారావు, ఫాతిమా, దుర్గా, గోపి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *