Breaking News

సర్కిల్ -2 పరిధిలో ప్రజల సౌకర్యార్థం 4 అదనపు ఆస్తిపన్ను చెల్లింపు కేంద్రాల ఏర్పాటు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆస్తిపన్ను చెల్లింపులకు సంబంధించి అదనంగా నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. సర్కిల్ – 2 కు సంబంధించి ప్రస్తుతం ఒక్క సత్యనారాయణపురం కేంద్రంగా చెల్లింపులు జరుగుతుండగా.. ప్రజల సౌకర్యార్థం మే 2 వ తారీఖు నుంచి మరో 4 కేంద్రాలను ఏర్పాటు చేయడమైనది. పాయకపురంలోని వార్డు సచివాలయం నెం.269., అజిత్ సింగ్ నగర్లోని వార్డు సచివాలయం నెం. 259., గవర్నర్ పేటలోని వీహెచ్ఆర్ కాంప్లెక్స్ లోని 98వ వార్డు సచివాలయం., మధురానగర్ లోని వార్డు సచివాలయం నెం.210లో కొత్తగా సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కావున నగర ప్రజలందరూ ఈ అవకాశాలను సద్వినియోగపరుచుకోవలసిందిగా కోరడమైనది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *