విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కార్మికుల పోరాట స్ఫూర్తి, చైతన్యానికి ప్రతీక మేడే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కార్మికులకు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికుల శ్రమ దేశ సంపద సృష్టికి మూలం. జాతి నిర్మాణంలో కార్మికుల చెమట, రక్తం ఉన్నాయి. మన సమాజ గతిని.. పురోగతిని శాసించేది, నిర్దేశించేది శ్రామిక వర్గమే. అటువంటి కార్మిక లోకానికి ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. కార్మికుల ప్రయోజనాల పరిరక్షణలో, కార్మిక సోదరుల సంక్షేమం కోసం పథకాలు రచించటంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన దేశంలోనే సువర్ణ అధ్యాయం. ఆ మహానేత స్పూర్తితో కార్మికుల పక్షపాతిగా.. వారి హక్కుల పరిరక్షణకు, కార్మికుల కుటుంబాలు మరింత సంతోషంగా ఉండేందుకు జగనన్న ప్రభుత్వం అన్ని విధాలా పాటుపడుతోంది. కార్మిక చట్టాలు పకడ్బందీగా అమలు కావాలన్నదే వైఎస్సార్ సీపీ ప్రభుత్వ ధ్యేయం. ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్బంగా మరోసారి కార్మిక సోదరులకు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
Prajavartha Online Telugu News