-జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో 10వ తరగతి పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ప్రశాంత వాతావారణంలో సజావుగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అన్నారు. నగరంలోని మొగల్రాజపురం బోయపాటి శివరామకృష్ణ మున్పిపల్ హైస్కూల్ నందు నిర్వహిస్తున్న 10 తరగతి పరీక్ష కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత నెల 27వ తేదీ నుండి జిల్లాలో నిర్వహిస్తున్న 10 తరగతి పరీక్షలు అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ సజావుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాలలో మౌలిక సదుపాయలను మెరుగుపరచాలని ప్రస్తుత పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రత వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు చల్లటి త్రాగునీటిని అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనితో పాటు అత్యవసర వైద్య సదుపాయలు కూడా అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్ష సమయంలో విద్యార్థులు ఎటువంటి అస్వస్థత గురి అయినా వారి విలువైన సమయం వృదా కాకుండా తక్షణమే ఉపసమనానికి అవసరమైన వైద్య పరీక్షలు అందించి ఓఆర్‌ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాలోనికి ఎట్టి పరిస్థితులలోను ఇతరులను అనుమతించరాదని మాల్ ప్రాక్టీస్, మాస్ కాపీయింగ్ వంటి చర్యలకు పాల్పడకుండా నిరంతర నిఘా ఉంచాలన్నారు. అటువంటి సంఘటనలు ఉత్పన్నం అయితే కారకులైన వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఫైయింగ్ స్కాడ్స్ అధికారులు నిరంతరం పరీక్షా కేంద్రాలను ఆకస్మీకంగా తనిఖీలు నిర్వహిస్తున్నారని పరీక్ష్షా కేంద్రంలో సిబ్బంది విధి నిర్వహణలో ఆలసత్వం వహిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. మిగిలిన పరీక్షలను కూడా సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
Prajavartha Online Telugu News