Breaking News

గృహా నిర్మాణాలను వేగవంతం చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గృహా నిర్మాణాలను వేగవంతం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న గృహా నిర్మాణాల ప్రస్తుత ప్రగతి, జగనన్న సంపూర్ణ గృహా హక్కు పై శుక్రవారం గృహా నిర్మాణ శాఖ అధికారులు, óయంపిడివోలు, మున్పిపల్‌ కమీషనర్లు, తహాశీల్థార్లతో నగరంలోని స్థానిక కలెక్టరేట్‌ కార్యాలయం నుండి వీడియోకాన్ఫరెస్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగనన్న గృహా నిర్మాణాల లబ్దిదారులు సకాలంలో గృహాలు నిర్మించుకునేలా సంసిధ్దులను చేయాలన్నారు.గృహా నిర్మాణాల పురోగతి, మౌలిక సదుపాయల కల్పనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంజూరైన గృహాలను లబ్దిదారులు ప్రారంభించుకునేలా ప్రోత్సహించాలన్నారు. త్వరితగతిన నిర్మాణాలు ప్రారంభింపచేయాలన్నారు. బిలో బెస్‌మెంట్‌ స్థాయిలో ఉన్న గృహాలను బెస్మెంట్‌ స్థాయికి తీసుకురావాలన్నారు. బెస్‌మెంట్‌ స్థాయిలోని గృహాలను రూప్‌లెవల్‌ స్థాయికి, రూప్‌లెవల్‌ స్థాయిలో ఉన్న వాటిని రూప్‌ క్యాస్టింగ్‌ స్థాయికి తీసుకువచ్చి పూర్తి చేయాలన్నారు. ఇప్పటివరకు బెస్‌మెంట్‌ లెవెల్‌ ఆ పైన ఉన్న 9,913 గృహాలను పూర్తి చేయించాలన్నారు. జిల్లాలో ఇంకనూ ప్రారంభం కాని 14,255 గృహాలను లబ్దిదారులతో త్వరితగతిన ప్రారంభింప చేయాలన్నారు. బిలో బెస్‌మెంట్‌ స్థాయిలో ఉన్న 46,688 గృహాలను బెస్‌మెంట్‌ స్థాయికి తీసుకువచ్చేలా అధికారులు దృష్టి పెట్టాలన్నారు. లేఅవుట్లలో అవసరమైన ఇసుక సిమ్మెంట్‌ ఐరన్‌ వంటి మెటిరియల్‌ అందుబాటులో ఉంచాలని అన్నారు. ఇప్పటికే లబ్దిదారుల ఖాతాలకు ఎప్పటికప్పుడు నగదు జమ అవుతుందని అన్నారు.లబ్ధిదారులు గృహా నిర్మాణాలను జరుపుకునేందుకు అవసరమైన విద్యుత్‌, నీటి సదుపాయాలను ఆయా శాఖల అధికారులు తక్షణమే కల్పించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశించారు. జగనన్న సంపూర్ణ గృహా హక్కు పథకంలో భాగంగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రతీ రోజు కనీసం 50 మంది లబ్ధిదారులతో రిజిస్ట్రేషన్‌ చేయించాలని, డిజిటల్‌ సిగ్నెచర్‌ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సాంకేతికంగా ఎదురయ్యే సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాన్నారు. ఈ వీడియోకాన్ఫరెస్స్‌లో సబ్‌ కలెక్టర్‌ జి ఎస్‌ఎస్‌ ప్రవీణ్‌చంద్‌, హౌసింగ్‌ పిడి వి శ్రీదేవి, ఇఇ బిఎస్‌ రవీకాంత్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌, విద్యుత్‌ శాఖాధికారులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *