-రూ. 16.25 లక్షల విలువైన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర అభివృద్ధే జగనన్న ప్రభుత్వ ధ్యేయమని, సంక్షేమ పథకాలు ప్రజల హక్కుగా ఈ ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా ప్రజాసమస్యల పరిష్కారానికై సత్యనారాయణపురంలోని పలు వీధులలో స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తితో కలిసి పర్యటించారు. పాపరాజు వీధి, బ్రహ్మయ్యపంతులు వీధి, సన్నిదానం వీధి, కావూరి వారి వీధి, శివరావు వీధులలో పర్యటించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థపై ఫిర్యాదులు అందడటంతో.. పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. దోమలు వృద్ధి చెందకుండా ఎప్పటికప్పుడు యాంటీ లార్వా ఆపరేషన్స్ చేపట్టాలన్నారు. అనంతరం పాపరాజు వీధి, సన్నిదానం వారి వీధులలో పలు అభివృద్ధి పనులకు స్థానికులతో కలిసి శంకుస్థాపన చేశారు. డివిజన్ లో ప్రగతి పనులు శరవేగంగా జరుగుతున్నాయని.. ఇందులో భాగంగా రూ. 16.25 లక్షల విలువైన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు. చంద్రబాబు హయాంలో డివిజన్ పూర్తిగా కళ తప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉండగా వేసిన రోడ్లు తప్ప.. గత తెలుగుదేశం ప్రభుత్వం రోడ్లను కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. కానీ ఈ ప్రభుత్వం ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తోందన్నారు. ఎ.కె.టి.పి.ఎం. ప్రభుత్వ పాఠశాలలో ఏటా పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని 6 అదనపు తరగతి గదులను నిర్మించుకోవడం జరిగిందన్నారు. జూన్ మాసం నుంచి నూతన తరగతి గదులను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. మరోవైపు డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారానికి చేపట్టిన యూజీడీ సంపు నిర్మాణ పనులు కూడా తుది దశకు చేరుకున్నట్లు వివరించారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. 35 నెలల వైఎస్ జగన్ పాలనతో దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఓవైపు ప్రతిపక్షాల కుట్రలు, కుతంత్రాలతో యుద్ధం చేస్తూనే.. మరోవైపు సంక్షేమాన్ని కళ్ల ముందు ఆవిష్కరిస్తున్నారన్నారు. పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, పురపాలక, తిరుపతి లోక్సభ ఉపఎన్నిక, బద్వేలు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ రికార్డు విజయాలు సాధించడం నానాటికీ ఈ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమన్నారు. కానీ ఎప్పుడు ఎన్నికలొచ్చినా పొత్తులతోనే చంద్రబాబు పోటీ చేస్తారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీకి నైతికత, సిద్ధాంతం లేవన్నారు. 2019లో ప్రజా తిరుగుబాటును చవిచూసిన చంద్రబాబు తీరు మారలేదన్నారు. రాష్ట్రంలో సుస్థిర పాలనను అందిస్తోన్న ప్రభుత్వాన్ని బద్నామ్ చేసేందుకు ప్రయత్నిస్తూ.. మరోసారి ప్రజల ఛీత్కారానికి గురవుతున్నారన్నారు. 2024లో ప్రజాతీర్పు ఏవిధంగా ఉండబోతుందో ఈపాటికే ప్రతిపక్షాలకు పూర్తిగా అర్థమైందని మల్లాది విష్ణు అన్నారు. అందుకే భయంతో రెండేళ్ల ముందే పొత్తులు గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ఏకమై వచ్చినా.. 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒంటరిగానే బరిలోకి దిగి తిరుగులేని విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రాజు, ఎ.ఎం.ఓ.హెచ్(సర్కిల్-2 ఇంచార్జి) శ్రీదేవి, ఆర్.ఐ.(సివిల్ సప్లయిస్) లలిత, ఏఈ వెంకటేష్, శానిటరీ ఇన్స్ పెక్టర్ నాయక్, ఎస్సై కె.కుమారి, డివిజన్ కోఆర్డినేటర్ దోనేపూడి శ్రీనివాస్, నాయకులు శనగవరపు శ్రీనివాస్, లంకా బాబు, రాగంపూడి మల్లిక్, ఈశ్వర్ కృష్ణ, మైలవరపు రాము, కమ్మిలి రత్న, రామలింగేశ్వరరావు, సనత్, చాంద్, చామర్తి మూర్తి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News