Breaking News

ఇబ్రహీంపట్నం మండలంలో పలు గ్రామాలలో జాయింట్‌ కలెక్టర్‌ విస్తృత పర్యటన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
త్రిలోచనాపురం గ్రామంలోని కృష్ణానదీలో లంక భూమి లీజు కొరకు దాఖలు చేసుకున్న కనకదుర్గా అగ్నికులక్షత్రియ ఫీల్డ్‌ లేబర్‌ కో-ఆపరేటివ్‌ సొపైటీ జుపూడి వారి ఆర్జీ విషయమై సర్వే నెంబర్‌ 209 లోని భూమిని బుధవారం జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నూపుర్‌ అజయ్‌ రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం కేతనకొండ గ్రామంలో నవరత్నాలు`పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా గృహా నిర్మాణాలు జరుపుకుంటున్న లబ్ధిదారుల లే`అవుట్‌ను రెవెన్యూ, గృహా నిర్మాణ శాఖ అధికారులతో జాయింట్‌ కలెక్టర్‌ నూపుర్‌ అజయ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసుకునే విధంగా లబ్దిదారులతో ముఖాముఖీ నిర్వహించారు. లేఅవుట్లలో ఇసుక, సిమెంట్‌, స్టీల్‌ వంటివి అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఇంకనూ ప్రారంభం కాని గృహాలను త్వరితగతిన ప్రారంభింప చేసేలా లబ్దిదారులను ప్రోత్సహించాలని అధికారును కోరారు.

కోటికలలపూడి గ్రామ సచివాలయం, అంగనవాడీ కేంద్రం ఆకస్మీక తనిఖీ
కోటికలపూడి గ్రామ సచివాలయాన్ని జాయింట్‌ కలెక్టర్‌ నూపుర్‌ అజయ్‌ ఆకస్మీకంగా తనిఖీ చేశారు. సంక్షేమ పథకాల లబ్దిదారుల జాబితాను పరిశీలించారు. సచివాలయంలో ప్రజల సమర్పించే అర్జీలు గడువులోగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సచివాలయంలోని రిజిస్ట్రర్లను, సిబ్బంది హాజరు పట్టి, మూమెంట్‌ రిజిస్ట్రర్లను, పరిశీలించారు. సచివాలయం ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో అర్హులైన లబ్దిదారుల నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఎన్టీఆర్‌ జిల్లాలో కృష్ణాజిల్లా పేరుతో ఇంకా కొన్ని బోర్డులు ఉండటం గమనించి తక్షణమే బోర్డులను మార్చాలని ఆదేశించారు. కోటికలపూడి గ్రామలోని అంగనవాడి కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడి కేంద్రంలోని సిబ్బందితో మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని ఆదేశించారు. చిన్నారులకు పౌష్టికాహారంతో కూడిన ఆహారం అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ పర్యటనలో జాయింట్‌ కలెక్టర్‌ వెంట ఇబ్రహింపట్నం తహాశీల్థాం యం. సూర్యారావు, గ్రామ సర్పంచ్‌ నాగరాజు, యంపిటిసి వెంకట్రావు, సచివాలయ సిబ్బంది ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *