Breaking News

చిన్నారి మౌనికకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు అభినందనలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్రీడలు, యోగా పట్ల ఆసక్తి కనబరిచే యువతను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. భువనేశ్వర్ లో జరిగిన అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయాల స్త్రీ, పురుషుల యోగా ఛాంపియన్ షిప్, పూరీలో జరిగిన ఆల్ ఇండియా ట్రెడిషనల్ యోగాసన ఛాంపియన్ షిప్ లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పారుపల్లి మౌనిక(వాలీబాల్ క్రీడాకారిణి)ను గురువారం ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా 23వ డివిజన్ మాధవరెడ్డి వారి వీధిలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైసీపీ డివిజన్ ఇంఛార్జి ఆత్మకూరు సుబ్బారావుతో కలిసి పర్యటించిన ఆయన బాలిక కుటుంబంతో మాట్లాడారు. తమ పిల్లలను క్రీడలు, యోగా వైపు ప్రోత్సహించిన తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు మానసిక ఒత్తిడిని తట్టుకునేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. యోగాసనాల ద్వారా జ్ఞాపకశక్తి పెంపొంది పరీక్షల్లో మంచి మార్కులు సాధించగలుగుతారని అన్నారు. యోగా ద్వారా దీర్ఘకాలిక రోగాలనుండి ఉపశమనం కలిగే వీలుందన్నారు. కనుక ప్రతి ఒక్కరు నిత్య జీవితంలో యోగా సాధనను భాగంగా చేసుకోవాలన్నారు. అలాగే చిన్నారి మౌనిక రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు సొంతం చేసుకోవాలని, అంతర్జాతీయంగా రాణించాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. క్రీడల అభివృద్ధికి, క్రీడాకారులకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *