Breaking News

ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ – ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తున్న తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అర్హులైన ప్రతి ఒక్కరికి కులం,పార్టీ,కులం అనేది చూడకుండా అందరికి సంక్షేమ పథకాలు అందజేయాలి అనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వం పని చేస్తుంది అని విజయవాడ తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. గురువారం నాడు ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగాంగా స్థానిక 7వ డివిజన్ లో 90వ వార్డు సచివాలయం పరిధిలోని శిఖామణి సెంటర్ నుండి మొదలై దాసరి స్ట్రీట్, రెల్లీస్ స్ట్రీట్, ఇస్సాక్ స్ట్రీట్, అంబేద్కర్ స్ట్రీట్, దేవానందం స్ట్రీట్ మరియు సుదర్శన్ స్ట్రీట్ వరకు ప్రాంతంలో స్థానిక కార్పొరేటర్ మేరకనపల్లి మాధురితో కలిసి ఇంటి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల అమలు తీరును,ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.సంక్షేమ పథకాల లబ్దిదారులకు జగనన్న ఉత్తరం ఇచ్చి వారికీ వచ్చిన ప్రతి పథకం గురించి అవినాష్ వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు అయిన మూడేళ్ళ కే ఇచ్చిన హమీలో 90% హమీలను పూర్తి చేసి ప్రజల ముందుకు వచ్చిన ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ ప్రభుత్వం మాత్రమే అని, ప్రజలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరిపాలన పట్ల పూర్తి నమ్మకంతో ఉన్నారు అని, ప్రతి గడప సంతోషంగా పలుకరింపులో నే తమ మద్దతు తెలియచేస్తుంది అని, ఎన్నికల అనంతరం మ్యానిఫెస్టోని అన్ లైన్ నుంచి తొలగించిన టీడీపీ ప్రభుత్వం ఎక్కడ,మ్యానిఫెస్టోలో ఉన్న ప్రతి హమీని ప్రజలకు చూపిస్తూ అమలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం ఎక్కడ, టీడీపీ ఎన్ని విమర్శలు చేసిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.స్థానిక సమస్యలను సచివాలయ సిబ్బంది,మున్సిపల్ అధికారులతో మాట్లాడి త్వరలోనే పరిష్కారం చేయిస్తాం అని అన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది అని,మాకు అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయని మళ్ళీ మరో మారు జగన్ పరిపాలనే కావాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు వేగి వెంకటేశ్వర రావు,కుటుంబరావు,సంపత్,శ్యామ్,సొంగా రాజ్ కమల్,క్లైవ్,ఉదయ్, చైతన్య,సుధీర్,సుమన్,మహిళా నాయకులు సుభాషిణి,సుజాత,చంద్రిక,ప్రేమలత తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *