Breaking News

ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో సమస్యల పరిష్కరానికి కృషి చేద్దాం..

-రైతులకు ముందుగానే సాగునీరు విడుదలతో మూడు పంటలకు అవకాశం…
-ఖరీఫ్‌ సాగుకు విత్తనాలు ఎరువులు పురుగుమందులు ఆర్‌బికె ద్వారా పంపిణీకి సిద్దంచేయండి…
-జగనన్న కాలనీల్లో 40 శాతం గృహా నిర్మాణం పూర్తి అయితే అన్ని మౌలిక వసతుల కల్పించాలి…
-జిల్లా ఇన్‌చార్జి మంత్రి, హోం శాఖ మంత్రి తానేటి వనిత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో ప్రజల సమస్యల పరిష్కరానికి కృషి చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, హోం మంత్రి తానేటి వనిత అన్నారు. నీటి పారుదల, వ్యవసాయ సలహా మండలి, జిల్లా సమీక్షా మండలి సమావేశాల దృష్టికి వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని తన పరిధిలో పరిష్కారం కాని సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చి పరిష్కారించి జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిక కృషి చేస్తానని మంత్రి తానేటి వనిత అన్నారు.
నీటి పారుదల, వ్యవసాయ సలహా మండలి, జిల్లా సమీక్షా మండలి సమావేశాలు గురువారం స్థానిక జలవనరుల శాఖ ఆవరణలో గల రైతు శిక్షణ కేంద్రం నందు జిల్లా ఇన్‌చార్జి మంత్రి, హోం మంత్రి తానేటి వనిత అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో తానేటి వనిత మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పదవీభాధ్యతలు చేపట్టిన గత మూడు సంవత్సరాల నుండి వరుణ దేవుడు దయతో వర్షాలు పుష్కలంగా కురియడంతో జలాశయాలు నిండుగా
ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం సకాలంలో సాగునీటిని విడుదల చేయకపోవడం వలన రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. రైతులు అడగకుండానే సాగునీటిని విడుదల చేస్తే మూడు పంటలను పండిరచుకుని ఆర్థికంగా బలపడి రైతులు సంతోషంగా ఉంటారన్నాదే ముఖ్యమంత్రి ఆలోచన అన్నారు. ఈ ఆలోచనతోనే జూన్‌ 10వ తేది నుండి కృష్ణా డెల్టా రైతాంగానికి సాగునీటిని విడుదల చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. విడుదల చేసిన సాగునీరు చివరి భూముల వరకు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సాగునీటి కాలువల మరమ్మత్తులు పూడిక తీత, గుర్రపు డెక్క తొలగించడం వంటి పనులను మాసాంతానికి పూర్తి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ఎన్‌ఎస్‌పి కాలువ మునేరు, పులిచింతల, ఆయుకట్టు కింద రైతాంగానికి సకాలంలో నీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వైఎస్సార్‌ వేదాద్రి పనులు నిధుల కొరత వలన ఆపడం జరిగిందని, కంచల ఎత్తిపోతల పథకం మోటారు రిపేర్లకు అవసరమైన నిధులకు ప్రతిపాదనలను సమర్పిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పథకాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటారన్నారు. ఖరీఫ్‌లో రైతాంగానికి అవసరమైన విత్తనాలు ఎరువులు పురుగుమందులను సిద్దం చేసుకుని ఆర్‌బికెల ద్వారా పంపిణీ చేసేందుకు వ్వయసాయ అధికారులు ప్రణాళికబద్దంగా ముందుకు వెళ్లాలన్నారు.
పశ్చిమ కృష్ణా ప్రాంతంలో మిర్చి పంటకు తామర తెగుల వలన దాదాపు 42 వేల ఎకరాలకు పైగా మిర్చి రైతులు నష్టాలకు గురి కావాల్సి వచ్చిందన్నారు. తామర తెగుల నివారణకు ప్రస్తుతం ఎటువంటి నివారణ మందులను వినియోగించిన్నపట్టికి ఫలితం లేకపోయిందని మిర్చిపంటకు ఇన్సూరెన్స్‌ సౌకర్యం లేకపోవడం వలన ఎకరానికి 70 నుంచి లక్ష వరకు పెట్టుబడి పెట్టిన రైతులు కోలుకోలేని ఆర్థిక నష్టానికి గురి అయ్యారని వీరిలో అధిక శాతం కౌలు రైతులు ఉన్నారని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయబాను సమావేశలో చర్చించగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చి మిర్చి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటనని మంత్రి అన్నారు.
కృష్ణా డెల్టా పులిచింతల ప్రాజెక్టు నిర్వహణ భాధ్యత ఎన్‌టిఆర్‌ జిల్లాదని వీటి నిర్వహణకు సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని ఆరకొరకుగా ఉన్న తాత్కాలిక సిబ్బంది కూడా జీతాలు చెల్లించడంలేదని అలాగే జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం ప్రాంతాలలో ఎన్‌ఎస్‌పి కెనాల్స్‌ నిర్వహణకు సిబ్బంది లేరని ఉన్న 26 మంది తాత్కాలిక లస్క్‌ర్‌లకు సకాలంలో జీతాలు చెల్లించకపోడం వలన వారు విధుల నిర్వహణలో నిరాశక్తతను వ్యక్తపరుస్తున్నారన్నారు. వీరి జీతాలను ఆప్కాస్‌ నుండి చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. జగ్గయ్యపేట మండలం నవాబుపేటలో ఎయిడెడ్‌ పాఠశాలను రద్దు చేయడం జరిగిందని, నవాబుపేటకు ప్రభుత్వ పాఠశాలను మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవలని సామినేని ప్రభుత్వ విప్‌ ఉదయభాను కోరారు.
శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్‌రావు మాట్లాడుతూ గొల్లపూడి పంపింగ్‌ స్కీమ్‌ పూడికతీత పనులు పూర్తి చేస్తే దాదాపు 3 వేల ఎకరాలకు సాగునీటిని అందించగలుగుతామని ఇందుకు నిధుల కోరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. మెట్ట ప్రాంతంలోని పత్తి మిర్చి సుబాబుల్‌ పండిరచే రైతులకు సకాలంలో సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవడంతోపాటు పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
శాసనసభ్యులు కొక్కిలిగడ్డ రక్షణనిధి మాట్లాడుతూ వినగడప వద్ద కట్లేరు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసేలా జిల్లా ఇన్‌చార్జి మంత్రి ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. ఎ కొండూరు, రెడ్డిగూడెం ప్రాంతాలలో గిరిజనలు కిడ్నిల వ్యాధితో బాధపడుతున్నటు గుర్తించడ జరిగిందన్నారు. భూగర్భజలాలో ఫ్లోరైడ్‌తో కూడిన సిలికాన్‌ శాతం ఎక్కువగా ఉందని తేలిందన్నారు. ఆ ప్రాంత ప్రజానికి స్వచ్చమైన కృష్ణా నీటిని అందించేందుకు 37 కోట్ల రూపాయలతో తాగునీటి సరఫరా పథకానికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపడం జరిగిందని త్వరలో నిధులు మంజూరు అయ్యేలా కృషి చేయాలన్నారు. తిరువూరులో ఎసిపి కార్యాలయం ఎర్పాటు చేసేందు చర్యలు తీసుకోవాలని తెలదేవరపల్లి పైలెట్‌ ప్రాజెక్ట్‌ ట్యాంక్‌ నిర్మాణం పూర్తి అయి పైపు లైన్‌ అమర్చినప్పుటికి కొద్దిపాటి పనుల వలన అది ఉపయోగంలోకి రాలేదని తక్షణమే పనులు పూర్తి చేసి ఉపయోగంలోకి తీసుకువచ్చాలా అధికారులను ఆదేశించాలన్నారు.నూతిపాడు ఎత్తిపోతల పథకం మోటార్ల రిపేర్లకు 70 లక్ష నిధులకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపడం జరిగిదని, నిధులు మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు.
శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌, వెలంపల్లి శ్రీనివాస్‌లు మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్‌ పశ్చిమ తూర్పునియోజకవర్గాలకు సంబంధించిన దాదాపు 25 వేల మంది పేదలకు సొంత ఇంటి కళను నేరవేర్చాలని జగనన్న గృహానిర్మాణ పథకం కింద ఇళ్ల పట్టాలను అందించి గృహాలు నిర్మించేందుకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. లబ్ధిదారులను చైతన్యవంతులను చేసి గృహా నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఆర్థిక సహాయంతోపాటు బ్యాంకుల నుండి రుణ సహాయం అందించేలా బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించవలసిన అవసరం ఉందన్నారు.
జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు మాట్లాడుతూ కృష్ణా డెల్టాకు జూన్‌ 10వ తేదిన కాల్వల ద్వారా సాగునీటిని విడుదల చేయనున్నామని అవసరమైతే జూన్‌ 15 నుండి 18వ తేదీలోపల పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు సాగునీరు అందించే అవకాశం ఉందని పోలవరం ఇరిగేషన్‌ అధికారులు తెలిపారన్నారు. 123 కోట్ల రూపాయలతో చేపట్టిన రిటైనింగ్‌ వాల్‌ పనులు సరవేగంతో జరుగుతున్నాయని ఈ ఏడాది 8 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలఅయిన్నపట్టికి కృష్ణలంక ప్రాంత ప్రజలు ముంపునుండి కాపాడేవింధంగా 6 మీటర్ల ఎత్తున మొదటి దశ పనులు పూర్తి చేస్తున్నట్లు కలెక్టర్‌ వివరించారు. జిల్లాలో 83,633 గృహాలు మంజూరు కాగా, 75,344 గృహాలు రిజిస్ట్రర్‌ అయ్యాయని, మిగిలినవి వివిధ సాంకేతిక కారణాల వలన రిజిస్ట్రర్‌ కాలేదని వాటిని రిజిస్ట్రర్‌ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రిజిస్ట్రర్‌ అయిన వాటిలో 45,888 బిలో బెస్‌మెంట్‌ లెవల్‌లో ఉన్నాయని, 7,246 బెస్‌మెంట్‌ లెవల్‌, 1,363 రూప్‌లెవల్‌, 4,303 స్లాబ్‌ లెవల్‌లో ఉండగా 2,499 గృహాలు పూర్తి అయ్యాయని, మిగిలిన 13,845 గృహాలను లబ్దిదారులు ప్రారంభించవలసి ఉందని కలెక్టర్‌ వివరించారు. జగనన్న కాలనీ లేఅవుట్‌లో లబ్దిదారులు గృహా నిర్మాణ పనులు చేపట్టేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాలనీల్లో మౌలిక వసతుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ప్రజా ప్రతినిధుల సహకారంతో సంక్షేమ అభివృద్ధి పథకాల అమలులో జిల్లాను అగ్ర స్థానంలో నిలిపేందుకు అధికారులు సమన్వయంతో ముందుకువెళ్లాలని కలెక్టర్‌ కోరారు. మనబడి నాడు కింద జిల్లాలో 431 పాఠశాలలో మరుగుదోడ్ల నిర్మాణం, త్రాగునీరు సరఫరా, పెంటింగ్స్‌, ఫర్నిచర్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, బ్యాక్‌బోర్డు, ఇంగ్లీష్‌ల్యాబ్‌లు,వంటగదులు, అదనపు గదులను నిర్మించి కార్పొరేట్‌ పాఠశాలాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిన్నట్లు కలెక్టర్‌ వివరించారు.
ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నూపుర్‌ అజయ్‌, మున్సిపల్‌ కమీషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పునకర్‌, సబ్‌ కలెక్టర్‌ జి సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌, డిఆర్‌వో కె.మోహన్‌కుమార్‌, జడ్పీచైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక, జిల్లా వ్యవసాయ సలహాల మండలి అధ్యక్షులు డి దామోదరెడ్డి, శాసనసమండలి సభ్యులు రుహుల్లా, కెఎస్‌ లక్ష్మణరావు, శాసనసభ్యులు సామినేని ఉదయభాను, మొండితోకజగన్మోహన్‌రావు, కె రక్షణనిధి, వెలంపల్లి శ్రీనివాస్‌, మల్లాదివిష్ణువర్థన్‌, కెడిసిసి బ్యాంకు చైర్మన్‌ టి. నాగేశ్వరరావు.ఇరిగేషన్‌ ఎస్‌సి ఎ మురళికృష్ణరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి యం. విజయభారతి, జడ్పిసిఇవో సూర్యప్రకాష్‌, జిల్లా పట్టు పరిశ్రమ అధికారి ఎన్‌. సత్యనారాయణ, ఏపిఎంఐపి పిడి రవికుమార్‌, జిల్లా ఉద్యానశాఖ అధికారి వి దాయకర్‌బాబు, జిల్లా పౌరసరఫరాల అధికారి పి కొమ్మలిపద్మా, సిపివో యం లలితదేవి, జిల్లా మైనార్టి అధికారి రియాజ్‌ సుల్తానా, ఆర్‌అండ్‌బి ఎస్‌సి శ్రీనివాస్‌మూర్తి, సోషల్‌ వెల్ఫెర్‌ అధికారి బి వి విజయభారతి, జిల్లా హౌసింగ్‌ అధికారి వి.శ్రీదేవి, ఆరోగ్యశ్రీ జిల్లా కో`ఆర్డినేటర్‌ జె.సుమన్‌, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *