Breaking News

నేడే జిల్లా వ్యాప్తంగా దిశ యాప్‌ మోగా ఈవెంట్‌ స్పెషల్‌ డ్రైవ్‌…

-ప్రతి మహిళ రక్షణ కోసం దిశ యాప్‌ మోగా ఈవెంట్‌ స్పెషల్‌ డ్రైవ్‌లో పాల్గొనండి..
-జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు పిలుపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళల మాన ప్రాణ రక్షణ కొరకు ప్రవేశపెట్టిన దిశ యాప్‌ను ప్రతి మహిళ డౌన్‌లోడ్‌ చేసుకునేలా చైతన్యవంతులుగా చేసేందుకు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న దిశ యాప్‌ మోగా ఈవెంట్‌ స్పెషల్‌డ్రైవ్‌ను జయప్రదం చేయాలని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు పిలుపునిచ్చారు.
మహిళలపై జరుగుతున్న అత్యాచారలు, హత్యలు, లైంగిక వేదింపులు వంటి వాటి నుండి రక్షణ పొందేందుకు ప్రభుత్వం రక్షణ కవచంగా ఏర్పాటు చేసిన దిశ యాప్‌ను ప్రతి మహిళ వారి సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునేలా ఈనెల 20 తేది శుక్రవారం జిల్లా వ్యాప్తంగా దిశ యాప్‌ మోగా ఈవెంట్‌ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. మోగా ఈవెంట్‌ జిల్లా, మండల గ్రామ స్థాయిలో నిర్వహించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. నగర పోలీస్‌ కమీషనర్‌ ఇతర పోలీస్‌ ఉన్నతాధికారులు జిల్లా జాయింట్‌, కలెక్టర్‌ సబ్‌ కలెక్టర్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు శుక్రవారం 10 గంటలకు విజయవాడ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం నుండి దశ యాప్‌ మోగా ఈవెంట్‌ స్పెషల్‌ డ్రైవ్‌ను ప్రారంభిస్తారని తెలిపారు. అన్ని మండల కేంద్రాల్లో మండలస్థాయి అధికారులు గ్రామాల్లోని గ్రామ సచివాలయాల్లో గ్రామ స్థాయి అధికారులు దిశ యాప్‌ మోగా ఈవెంట్‌ స్పెషల్‌ డ్రైవ్‌ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్‌ వివరించారు. దిశ యాప్‌ వల్ల కలిగే ఫలితాలను మహిళాలకు వివరించి మోగా ఈవెంట్‌ ద్వారా ప్రతి మహిళ తన స్మాట్‌ ఫోన్‌లో దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే విధంగా గ్రామ మండల జిల్లా స్థాయి అధకారులు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థిని విద్యార్థులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశావర్క్‌లు, స్వయం సహాయక బృందాల మహిళలు, వాలంటీర్లు ఒక్కొక్కరూ కనీసం 10 మంది మహిళలు దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేలా కృషి చేసి దిశ మోగా ఈవెంట్‌ స్పెషల్‌ డ్రైవ్‌ను జయప్రదం చేయడం ద్వారా మహిళల రక్షణలో భాగస్వామ్యం కావాలని కలెక్టర్‌ పిలుపునించ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *