Breaking News

రోడ్లు, డ్రైయిన్లు ఆక్రమించి ప్రజలకు అసౌకర్యం కలిగించరాదు

-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేదారేశ్వర పేట పండ్ల మార్కెట్ వద్ద మామిడి కాయల వ్యాపారులు ట్రాఫిక్ కు అంతరాయం కలిగించుటపై స్థానికులు మరియు పాదచారులు నగరపాలక సంస్థ కు పలు ఫిర్యాదులు చేయటం జరిగినది అంతేకాక సదరు వ్యాపారస్తులు తమ వ్యాపార నిర్వహణ కొరకు నగరపాలక సంస్థకు నిర్ణీత రుసుము (ఆశీలు) చెల్లించి అనుమతి పొంది లైసెన్సింగ్ నిబంధనలకు లోబడి వ్యాపార నిర్వహణ చేసుకొనవలసినదిగా ఇప్పటికి మూడు పర్యాయములు నగరపాలక సంస్థ సిబ్బంది, అధికారులు తెలియచేసిననూ ఖాతరు చేయకపోవుట చేత నగరపాలక సంస్థ ప్రణాళికా విభాగము మరియు ఎస్టేట్ విభాగము సంయుక్త ఆధ్వర్యములో ఆక్రమణల తొలగింపు కార్యక్రమము చేపట్టబడినది. ప్రజలకు, పాదచారులకు, ప్రయాణికులకు ఆటంకము కలిగించు విధముగా రోడ్డు, డ్రైయిన్లు ఆక్రమించు వారిపై తగు చర్యలు తీసుకొనబడునని కమిషనర్ వారు తెలియజేయడమైనది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *