Breaking News

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని విజయవంతానికి చర్యలు తీసుకోండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జూన్‌ 5వ తేదీన నిర్వహించనున్న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని విజయవంతం చేయడం ద్వారా ప్రజలను పర్యావరణ పరిరక్షణ పట్ల చైతన్యవంతులుగా చేయాలని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. జూన్‌ 5వ తేదీన జిల్లాలో నిర్వహించనున్న ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు శనివారం ఆయన కార్యాలయం నుండి వివిధ శాఖాధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ మాట్లాడుతూ పర్యావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల వలన జీవవైవిద్యం దెబ్బతినడంతోపాటు అనేక ఉపద్రావాలు సంభావిస్తున్నాయన్నారు. వీటిని ఆరికట్టేందుకు పర్యావరణంను పరిరక్షించుకోవలసిన భాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. ప్రజల్లో పర్యావరణం పట్ల అవగాహన కల్పించి వారిని చైతన్యం చేసేందుకు జూన్‌ 5వ తేది ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో పలు కార్యక్రమాలను నిర్వహించేందుకు జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. స్పూర్తి శ్రీనివాస్‌ సహకారంతో పర్యావరణ పరిరక్షణపై ప్పాట్‌ పెయింటింగ్‌ పోటీలను నిర్వహించాలని ఔత్సాహిక యువతి యువకులు అధికారులతో సైక్లిల్‌ రాలీలు నిర్వహించాలన్నారు. గ్రామ స్థాయి నుండి వ్యర్థపదార్థాలను సేకరించి సమీపంలోని మున్సిపాలిటిలకు తరలించే చర్యలు తీసుకోవాలని తరలించిన వ్యర్థ పదార్థాలను గుంటూరు సమీపంలోని నాయుడు పేటలో ఉన్న సాలిడ్‌ వెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రొసెసింగ్‌ కేంద్రం ద్వారా ప్రొసెసింగ్‌ చేసి పర్యావరణ పరిరక్షించేందుకు చర్యలను తీసుకోవాలన్నారు. తహాశీల్థార్లు యంపిడివోలు గ్రామ సచివాలయం అధ్యక్షలు, కార్యదర్శులు వారి కార్యాలయంలో 4 లేదా 5 మొక్కలను నాటి స్వీయ సంరక్షణ భాధ్యతను చేపట్టాలన్నారు. కొండపల్లిలోని హెచ్‌పిసిఎల్‌, బిపిసిఎల్‌, ఐఓసిఎల్‌, ఏపిజెన్‌కో సంస్థలతో పాటు పారిశ్రమిక వాడలలో 5వ తేదిన మొక్కలు నాటడం తప్పని సరి చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *