

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా శనివారం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయ ప్రాంగణము ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహానికి కేశినేని శివనాధ్ (చిన్ని) పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ అభిమానులచే కేక్ కటింగ్ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త కేశినేని డెవలపర్స్ అధినేత కేశినేని శివనాథ్ (చిన్ని) ఆధ్వర్యంలో 10 వేల మందికి అన్నదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేశినేని శివనాధ్ (చిన్ని) మాట్లాడుతూ ఆంధ్రుల ఆత్మ గౌరవం భారతదేశం అంతటా చాటిచెప్పిన మహనీయుడు నందమూరి తారకరామారావని, కూడు, గుడ్డ, నీడ నినాదంతో పేద ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన మహనీయుడని, రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం పెట్టి పేదల కడుపు నింపిన అన్నదాత ఎన్టీఆర్ ని, పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన వ్యక్తిగా, బడుగులకు రాజకీయ రిజర్వేషన్ తెచ్చిన నేతగా చరిత్రలో నిలిచిపోయారన్నారు. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఘనచరిత్ర అన్న ఆయనదని, నారా చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ ఆశయ సాధన లకు అనుగుణంగా పార్టీని ముందుకు నడిపిస్తూ ప్రగతి పథంలో తీసుకు వెళ్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి గౌరంగ బాబు, చెన్నుపాటి ఉషారాణి, సింహాద్రి కనకాచారి, లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్, గొట్టుముక్కల రఘురామరాజు, గొల్లపూడి నాగేశ్వరరావు, కరిముల్లాహ్, ఉప్పిడి రాము, గుమ్మడి గురుప్రసాద్, షేక్ ఆషా, దేవరపల్లి ఆంజనేయులు, అబ్దుల్ రషీద్, కోడూరు ఆంజనేయ వాసు, పామర్తి కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News