Breaking News

అభ్యుదయవాదిఎన్.టి.రామారావు… : పవన్ కళ్యాణ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు గడ్డపై జన్మించిన విశిష్ట వ్యక్తులలో ఎన్.టి.రామారావు  కూడా ఒకరు. సంప్రదాయ రాజకీయాలే ఆలంబనగా నడుస్తున్న రోజులలో ఒక రాజకీయ పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలకు భాగస్వామ్యం కల్పించి అభ్యుదయవాదిగా ఎన్.టి.ఆర్. నిలిచారు. అటువంటి గొప్ప వ్యక్తి శత జయంతి సందర్భంగా ఆయనకు నమస్కరిస్తున్నాను. తెలుగు భాషపై ఆయనకు ఉన్న మక్కువ, పట్టు నన్నెంతగానో ఆకట్టుకునేది. తెలుగు భాష కీర్తి ప్రతిష్టలను ఆయన దేశం నలుదిశలా వ్యాపింప చేసిన తీరు అమోఘం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా భారతదేశ రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన  ఎన్.టి.రామారావు  జయంతి సందర్భంగా నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన అంజలి ఘటిస్తున్నానని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శనివారం తమ కార్యాలయం నుండి విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *