Breaking News

అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 31వ తేదీన అజాదీ కా అమృత్‌ మహోత్సవ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారులు పాల్గొనేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు తెలిపారు. అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమం నిర్వహణపై శనివారం జిల్లా అధికారులతో కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు, జాయింట్‌ కలెక్టర్‌ యస్‌ నూపుర్‌ అజయ్‌ కలెక్టర్‌ కార్యాలయం నుండి టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 31వ తేదీన అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారని ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన జిల్లా అధికారులు లబ్దిదారులతో ముఖముఖీ సంభాషించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన అధికారులు హాజరు కావాలని కేంద్రప్రభుత్వ అమలు చేస్తున్న 13 పథకాల ద్వారా లబ్ది పొందుతున్న జిల్లా చెందిన లబ్దిదారులను కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలన్నారు. విజయవాడలోని కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి లబ్దిదారులు అధికారులు ప్రధాన మంత్రి జాతిని ఉద్ధేశించి ప్రసంగించే ప్రత్యక్ష ప్రసారం కార్యక్రామాన్ని వీక్షించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. 31వ తేదీ ఉదయం 9 గంటల నుండి మ.12 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *