-స్పందనలో 92 ఆర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టిఆర్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన ఆర్జీదారుల నుండి ఆర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు హృదయం స్పందించింది. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి అధికారులు తమ సమస్యలపై స్పందించి పరిష్కారం చూపుతారనే ఆశతో ప్రజలు సమర్పించే ఆర్జీలను గడువులోగా తప్పనిసరిగా పరిష్కరించడం ద్వారా ఆర్జీదారుల ఆశలు నెరవేర్చాలని అధికారులకు జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం ద్వారా 92 ఆర్జీలను జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలు పరిష్కారం అవుతామని ‘‘స్పందన’’పై ఎంతో నమ్మకంపెట్టుకుంటున్నారన్నారు. వారి నమ్మకానికి తగిన విధంగా ఆర్జీల పరిష్కారంలో అధికారులు మరింత ప్రత్యేక శ్రద్ద వహించి ఆర్జీదారులకు పరిష్కార మార్గం చూపాలన్నారు. విభిన్నప్రతిభావంతులు, దివ్యాంగులు, వృద్దులు, వితంతువులు, రైతులు, స్పందన ద్వారా పెట్టుకున్న ఆర్జీలు పరిష్కరించడంలో సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వారి పరిధిలో లేని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. దరఖాస్తులపై సంబంధిత అధికారులు క్షత్రస్థాయిలో క్షుణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి ఆర్జీదారుడు సంతృప్తిచెందేలా పరిష్కరించాలన్నారు. పెండిరగ్ బియాండ్ ఎస్ఎల్ఏ రీఓపెన్ లేకుండా చూడాలన్నారు. ఆర్జీలను నాణ్యతతో ఆర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలే తప్ప మొక్కబడిగా పరిష్కరిస్తే ఆర్జీలు తిరిగి మళ్లీ స్పందనకు వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ యస్ డిల్లీరావు అన్నారు.
విభిన్నప్రతిభావంతులకు లాప్‌టాప్‌లు సెల్ఫోన్లను అందించిన జిల్లా కలెక్టర్…
జిల్లా విభిన్నప్రతిభావంతులు టి.జి మరియు వయోవృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్, ఎల్ఎల్బి డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు మంజూరైన లాప్టాప్లను సెల్ఫోన్లను జిల్లా కలెక్టర్ యస్. డిల్లీరావు అందజేశారు. విజయవాడకు చెందిన బిటెక్ విద్యార్థిని మల్లెల జయశ్రీ, వత్సవాయికి చెందిన ఎల్ఎల్బి విద్యార్థి షేక్నాగులమీరా , విజయవాడకు చెందిన బికామ్ విద్యార్థి పి రామకృష్ణారెడ్డిలకు ఒక్కొక్కరికి 35 వేల రూపాయలు విలువగల లాప్టాప్లను, సైగల భాషా తెలిసిన విజయవాడకు చెందిన షేక్ మహబూబ్ సుభాని వత్సవాయికి చెందిన గొర్రెపాటి సతీష్, జి శ్రీరామ్‌లకు ఒక్కొక్కరికి 12 వేల రూపాయల విలువగల టచ్ఫోన్లను కలెక్టర్ యస్. డిల్లీరావు అందజేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ కుమార్, డిఆర్వో కె.మోహన్‌కుమార్, జిల్లా విభిన్నప్రతిభావంతులు టి.జి మరియు వయోవృద్దుల సంక్షేమ శాఖ ఏడి రామ్‌కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.
Prajavartha Online Telugu News