Breaking News

వైకాపా పాలనలో విద్యా రంగం అస్తవ్యస్థం…

-ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైకాపా పాలనలో విద్యా రంగం అస్తవ్యస్థంగా మారిందనిఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి విమర్శించారు. విద్యార్ధుల పట్ల కంస మామలా, శకుని మేనమామ లా ముఖ్యమంత్రి జగన్ తయారు కావడం శోచనీయమని అన్నారు. మూడు, నాలుగు, ఐదు తరగతులను హై స్కూల్ లలో విలీనం చేయడం పిచ్చి తుగ్లక్ చర్య అని ఆరోపించారు. ఈమేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తొలి భాష ప్రయుక్త రాష్ట్రం గా ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ లో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయడం ఒక చారిత్రిక తప్పిదం అని అన్నారు. ప్రైవేట్, ఎయిడెడ్ పీజీ కళాశాలలో చదివే పేద విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన రద్దు చేస్తూ జీఓ 77 రద్దు చేయడం అన్యాయంఅని, విదేశీ విద్యకు మంగళం పాడడం గర్హనీయం అని పేర్కొన్నారు. జీఓ 117 అసంబద్ధం అని, దీని వలన ఎన్నో ప్రాథమిక పాఠశాలలు ఏకో పాధ్యాయ పాఠశాలలు అవుతాయన్నారు. ఈ జీఓ విధ్యార్థులకు నష్టం అని, ఉపాధ్యాయులకు పెను భారం అవుతుందని చెప్పారు. 18 సెక్షన్లకు ఒక హిందీ టీచరా! అని తులసి రెడ్డి ప్రశ్నించారు. ప్రీ హై స్కూల్ లలో హెడ్ మాస్టర్ పోస్ట్ ఉండదని, 137 మంది కంటే విద్యార్ధుల సంఖ్య తక్కువగా ఉంటే పిఈటి పోస్ట్ ఉండదట అన్నారు. ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించే కుట్రలో భాగమే జీఓ 117 తీసుకు వచ్చారని అర్పించారు.

కాంగ్రెస్ డిమాండ్ లు…
మూడూ, నాలుగు, ఐదు తరగతులను హై స్కూల్ విద్యలో కలిపే ప్రక్రియను ఉపసంహరించుకోవాలి
పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలి
జీఓ 77 ఉపసంహరించుకోవాలి
విదేశీ విద్యకు నిధులు ఇవ్వాలి
జీఓ 117 ను ఉపసంహరించుకొని, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలి

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఎన్‌టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో విజయవాడ పటమటలంకలోని అదిత్య డిగ్రీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *