Breaking News

కూలీలకు 3.20 లక్షల పనిదినాలను కల్పించి పలు అభివృద్ధి పనులు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉపాధి హమి పథకం ద్వారా జి. కొండూరు మండలంలో ఇప్పటి వరకు కూలీలకు 3.20 లక్షల పనిదినాలను కల్పించి పలు అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగిందని డ్వామా పాజెక్టు డైరెక్టర్‌ జె.సునీత తెలిపారు. జి. కొండూరు మండలం వెలగలేరు గ్రామంలో ఉపాధి హమి పథకం ద్వారా చేపట్టిన భలేరావు చెరువు పూడిత తీత పనులును డ్వామా పడి సునీత మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ జి. కొండూరు మండలంలో ఉపాధి హమి పథకం ద్వారా కూలీలకు ఈ ఏడాది 5.17 వేల పనిదినాలను కల్పించాలని లక్ష్యంగా నిర్థేశించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 3.20 లక్షల పని దినాలు కల్పించామన్నారు. ఉపాధి హమి పనుల ద్వారా మండలంలోని వెల్లటూరు, హెచ్‌ ముత్యాలంపాడు, వెలగలేరు, చెరువుమాదవరం తదితర గ్రామలలో చెరువుల పూడిత తీత పనులను పూర్తి చేయడం జరిగిందని ఆమె తెలిపారు. మండలంలోని చెవిటూరు, వెంకటాపురం, దుగ్గిరాలపాడు, కుంటముక్కల, గంగినేనిపాలెం, కవులూరు తదితర గ్రామాలలో చెరువుల పూడిత తీత పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటి వరకు దాదాపు 214 ఫీ˜ీల్డ్‌ చానల్స్‌ అభివృధ్ధి చేయడం జరిగిందని, ఉపాధి హమి పనుల ద్వారా మొక్కల నాటే కార్యక్రమాన్ని త్వరలో చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. రానున్న జూలై మసాంతరానికి మరో 2 లక్షలు కు పైగాపనిదినాలను కూలీలకు కల్పించి లక్ష్యాలను సాధించడంతో పాటు పలు అభివృద్ధి పనులు పూర్తి చేయటానికి ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నామని ప్రాజెక్టు డైరెక్టర్‌ జె సునీత వివరించారు. ఉపాధి హమి పరిశీలనలో పిడి వెంట జి. కొండూరు ఎపివో ప్రమీల, ఫీల్డ్‌ అసిస్టెంట్లు సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

HNSS పనులపై సీఎం చంద్రబాబు నాయుడు ఆరా…2027లోగా పూర్తి చేయాలని ఆదేశం

-2027 నాటికి HNSS శ్రీనివాసపురం రిజర్వాయర్ పనులుపై కేబినెట్‌లో మంత్రి మండిపల్లిని అడిగిన సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *