Breaking News

వాల్మీకి బోయల సమస్యలు పరిష్కరించాలి… : బంగారు కృష్ణమూర్తి


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ని కలిసి వాల్మీకి బోయల సమస్యలు పరిష్కరించాలని కోరినట్లు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారు కృష్ణమూర్తి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం, గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రపదేశ్ మైదాన ప్రాంత వాల్మీకి బోయలు ఎన్నో కష్టాలు ఎదుర్కుంటున్నారని, అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నారని, అభివృద్ది, సాధికారత కనుచూపు మేరలో కనపడటంలేదని సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిలు కర్నూలు జిల్లాలో ఇచ్చిన వాగ్ధానం నెరవేర్చనందున, అనేక మార్లు అనేక సంధర్భాలలో వారికి దృష్టికి తీసుకువచ్చిన ఇంతవరకూ మా సమస్యలను ఏవిధంగా పరిష్కరించనందున తాము ఎన్నో ఇబ్బందులకు గురౌతున్నామని అన్నారు. తమ కులం పట్ల వివక్షతను విడనాడి ప్రాంతీయ వ్యత్యాసాలను తొలగించి వెంటనే మైదాన ప్రాంత వాల్మీకి బోయలను గిరిజన జాబితాలోకి చేర్చాలని, ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం కోర్ కమిటీ సభ్యులమంతా కలిసి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ని రాజ్ భవన్ లో కలిసి మెమొరాండం ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సంధర్భంగా గవర్నర్ స్పందిస్తూ మీ సమస్యలను పరిష్కరించే విధంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక ప్రత్యేక మైన నోటు పంపించి తగిన చర్యలు తీసుకొనే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారన్నారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయ క్రాంతి నాయుడు, ఆర్గనైజేషన్ కార్యదర్శి జక్కుల శ్రీనివాస రావు, ఎక్జిక్యూటివ్ కమిటీ సభ్యులు నల్లబోతుల మల్లికార్జున, రాష్ట్ర యూత్,అధ్యక్షులు నక్క మహేష్ యువ , తలారి చలపతి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఎన్‌టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో విజయవాడ పటమటలంకలోని అదిత్య డిగ్రీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *