Breaking News

ప్రజలకు పారదర్శక సేవల ద్వారా సచివాలయాల వ్యవస్థకు వన్నెతీసుకురావాలి…

-జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలందించాలని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అన్నారు. శుక్రవారం కలెక్టర్‌ డిల్లీరావు నగరంలోని 32 నుండి 35 వరకు నాలుగు వార్డు సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను అర్హులైన లబ్దిదారులు సద్వినియోగం చేసుకునే విధంగా సచివాలయ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. సచివాలయాలకు వచ్చే ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. సచివాలయాలకు వచ్చే ప్రజలతో సిబ్బంది మార్యాదపూర్వకంగా వ్యవహరించి సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రజల నుంచి వచ్చే వినతుల పరిష్కారంలో జాప్యం లేకుండా పరిష్కరించాలన్నారు. ఇప్పటివరకు సచివాలయాలనికి వచ్చిన సర్వీసులు, పరిష్కరించిన వాటిపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వార్డులలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఎప్పటికప్పుడు డ్రైనేజీలో పూడికలు తొలగించాలని, ఇంటింటికి చెత్త సేకరణ నిర్వహించి పొడి తడి చెత్తను వేరుగా ఇచ్చే విధంగా అవగాహన కల్పించాలన్నారు. వార్డు పరిధిలో అభివృద్ధి సంక్షేమ పథకాలలో అర్హులైన లబ్దిదారులకు జాబితా ఉంచాలన్నారు. సచివాలయంలో సిబ్బంది హాజరు పట్టిక ఉద్యోగుల మూమ్మెంట్‌ రిజిస్టర్‌ సంక్షేమ పథకాల క్యాలెండర్‌ , ఎస్‌ఎల్‌ఏ గడువులోగా ప్రజా సమస్యల పరిష్కార చర్యల నివేదిక ప్రభుత్వ పథకాల పోస్టర్లు తదితర వాటిని కలెక్టర్‌ డిల్లీరావు పరిశీలించారు. కలెక్టర్‌ వెంట తూర్పు మండల తహాశీల్థార్‌ వెంకట్రామయ్య, 32 వార్డు పరిపాలన కార్యదర్శి షేక్‌ రహీమ్‌, వివిధ శాఖ ల కార్యదర్శులు యం ప్రమీల, బి సాంబశివరావు, కె. వెంకటేశ్వరరావు, బి స్వాతి, సిహెచ్‌ అరుణ, కె. మాధవరావు, కె వి లక్ష్మి తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *