విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనరంజకంగా పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి మద్దతు గా నేడు రాష్ట్రంలో ప్రజలు ముందుకు వస్తున్నారని, వైస్సార్సీపీ నాయకులు ప్రజలలోకి వెళుతుంటే బ్రహ్మరథం పడుతున్నారని, ప్రభుత్వం మీద వారి సంతృప్తి కి ఇదే నిదర్శనం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శనివారం స్థానిక ఇంచార్జ్ పర్వతనేని పవన్ (బాబీ) తో కలిసి దేవినేని అవినాష్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 11వ డివిజన్ 11వ డివిజన్, 1073041 సచివాలయ పరిధిలోని రీదు పుల్లారావు స్ట్రీట్ నుండి మొదలై దానయ్య బజార్, బేకరీ స్ట్రీట్, కరణం బజార్ ప్రాంతలలో ఇంటింటికి వెళ్లిన అవినాష్ లబ్దిదారులకు ఉత్తరం రూపంలో జగన్మోహన్ రెడ్డి చేసే సంక్షేమ పథకాలు అమలు తీరును వివరించి వారి దగ్గర నుండి సమస్యలు స్వేకరించి సంబంధిత అధికారులకు త్వరగతిన పరిష్కారం ఆయ్యేలా సూచించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమం -అభివృద్ధి కోసం పలు పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తున్నారని అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి సంక్షేమ పథకాల విషయంలో ప్రజలే అర్థం చేసుకుంటారు అని అన్నారు. కరోన కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగలేదని, గత తెలుగు దేశం పార్టీ ప్రభుత్వంలో పచ్చ చొక్కా వాళ్లకు మాత్రమే ప్రభుత్వ పథకాలను అందజేసే వాళ్లని, కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కులాలకు, మతాలకు,ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలియజేసారు, రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరారు. ప్రతి గడప గడపకు వెళ్తుంటే హారతులు పట్టి స్వాగతిస్తూ బ్రహ్మరథం పడుతూ తమ మద్దతు తెలియజేస్తుంటే జగనన్న నాయకత్వం లో పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అని అన్నారు.ఎన్నికలప్పుడు స్థానిక ఎంపీ కుమార్తె నిత్యం అందుబాటులో ఉంటాం అని చెప్పి ఓట్లు వేయుంచుకుని గెలిచాక డివిజన్ మొహం ఇప్పటి వరుకు చూసిందెలేదు అని స్థానిక ప్రజలు చెప్తున్నారు అని అన్నారు. గడప గడపకు వెళ్తుంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే,ఎంపీ ఉండి కూడా అబివృద్ది చేయలేదు అని,వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లోనే మాకు అబివృద్ది పనులు నిత్యం నాయకులు అందుబాటులో ఉంటున్నారు అని స్థానిక ప్రజలు తెలియజేస్తుంటే చాలా సంతోషం గా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, డివిజన్ ఇంచార్జ్ పర్వతనేని పవన్, బంకా సందీప్, పటమట దుర్గా ప్రసాద్, చక్రవర్తి, లక్ష్మి, ఇందిర, చోటు రిజ్వాన్, మాజీ డిప్యూటీ మేయర్ చెల్లారావు, ఉకోటి రమేష్, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News