Breaking News

పేదల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం జగన్ పాలన: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-31వ డివిజన్ 213 వ వార్డు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
-థ్యాంక్యూ సీఎం సార్ అంటూ లబ్ధిదారుల హర్షం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న నవరత్నాల పథకాలతో గడపగడపలో ఆనందం వెల్లివిరుస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. శుక్రవారం 31 వ డివిజన్ – 213 వ వార్డు సచివాలయం పరిధిలో స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్యం, పార్టీ శ్రేణులతో కలిసి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ కాలనీ, టీచర్స్ కాలనీలలో విస్తృతంగా పర్యటించి.. సుమారు 450 గడపలను సందర్శించారు. ప్రతిఒక్కరినీ పేరు పేరునా ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తూ యోగ‌క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మూడేళ్లలో ప్రభుత్వం చేసిన మంచితో పాటు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖను వివరించారు. ప్రజలకు అందించిన సంక్షేమాన్ని బుక్ లెట్ల ద్వారా తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పెద్ద ఎత్తున అందిస్తోన్న సాయాన్ని సక్రమంగా వినియోగించుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. అనంతరం ప్రజల నుంచి గ్రీవెన్స్ స్వీకరించారు. అధికారులు కూడా వెన్నంటి ఉండటంతో పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణ నుంచి వెకేషన్ కు వచ్చిన ఓ అధికారి కీర్తించడం ఎంతో సంతోషంగా ఉందని మల్లాది విష్ణు అన్నారు.

214 సచివాలయ పరిధిలో ఇప్పటివరకు రూ. 2.05 కోట్ల సంక్షేమాన్ని డీబీటీ విధానంలో అందించడం జరిగిందని మల్లాది విష్ణు వివరించారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా 238 మందికి ప్రతినెలా రూ. 6.14 లక్షలు అందిస్తున్నట్లు తెలిపారు. చేయూత ద్వారా 185 మందికి రూ. 34.68 లక్షలు., కాపు నేస్తం ద్వారా 33 మందికి రూ. 4.95 లక్షలు., అమ్మఒడి ద్వారా 303 మందికి రూ. 40.66 లక్షలు., విద్యాదీవెన ద్వారా 115 మందికి రూ. 21.62 లక్షలు., వాహనమిత్ర ద్వారా 45 మందికి రూ. 4.50 లక్షలు, వైఎస్సార్ ఆసరా ద్వారా 390 మందికి రూ. 58.45 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు వివరించారు.

పర్యటనలో భాగంగా దిశ యాప్ ఆవశ్యకతను అక్కచెల్లెమ్మలకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు వివరించారు. 5 టౌన్ ఎస్సై కుమారి, సచివాలయం మహిళ పోలీసులతో కలిసి యాప్ వినియోగంపై మహిళలు, యువతులకు అవగాహన కల్పించారు. యాప్ ను డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని తెలియజేయడంతో పాటు.. వినియోగించే ప్రక్రియను వివరించారు. ఆపదలో ఉన్నామని యాప్ ద్వారా సమాచారం ఇస్తే.. క్షణాల్లో సహాయం అందుతుందని పేర్కొన్నారు. ఎస్వోఎస్ బటన్ నొక్కిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి వస్తారని తెలియజేశారు. కనుక డివిజన్ లోని ప్రతి ఒక్క మహిళ, యువతి కూడా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం మహిళ పోలీసులు ఇంటింటికీ ప్రచారం నిర్వహించి వారిలో అవగాహన పెంచాలన్నారు. అలాగే ఉమెన్ పోలీసులు తమ నెంబర్ ను తమ పరిధిలోని విద్యార్థినులు, ఉద్యోగస్తులు, గృహిణులకు అందుబాటులో ఉంచాలన్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని.. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇన్ఫోసిస్‌ లాంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. తిరుపతిలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా దాదాపు రూ.4 వేల కోట్ల పెట్టుబడులు, 20 వేలకు పైగా ఉద్యోగావకాశాలు కల్పించే కంపెనీలను ప్రారంభించడమే ఇందుకు నిదర్శనమన్నారు. పారిశ్రామికరంగంలో రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ముందు స్థానంలో ఉంచేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కానీ కొన్ని దుష్టశక్తులు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి ప్రజలలోకి వెళ్లకుండా అడ్డుపడుతున్నాయన్నారు. ముఖ్యంగా నారా లోకేష్ పెడుతున్న ట్వీట్లను యువత అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. గత తెలుగుదేశం హయాంలో ప్రజాప్రతినిధులు అధికారులపై చేయి చేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయని మల్లాది విష్ణు అన్నారు. ప్రతిపక్షంలోనూ పచ్చ నేతల తీరు మారలేదన్నారు. అధికారులను వదలబోమంటూ అచ్చెన్నాయుడు మాట్లాడటం టీడీపీ నేతల అహంకారానికి అద్దం పడుతోందన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పరిస్థితి గుండు సున్నా కావడం ఖాయమని స్పష్టం చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జులై 8, 9 తేదీలలో గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురు గల ప్రాంగణంలో పార్టీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలు జరుగనున్నాయని మల్లాది విష్ణు తెలిపారు. నియోజకవర్గ ప్లీనరీని ఈనెల 27న గవర్నర్ పేట ఐ.వి.ప్యాలెస్ నందు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అటు రాష్ట్ర స్థాయిలో, ఇటు నియోజకవర్గ పరంగా జరిగిన అభివృద్ధిని, మూడేళ్లలో ప్రజలకు అందించిన సంక్షేమాన్ని ప్లీనరీ ద్వారా ప్రజల ముందు ఉంచుతామన్నారు. జిల్లా ఇంఛార్జి మంత్రి సహా పలువురు మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నార్త్ ఎమ్మార్వో దుర్గాప్రసాద్, జోనల్ కమిషనర్ రాజు, డీఈ(ఇంజనీరింగ్) గురునాథం, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, నాయకులు భోగాది మురళి, బెజ్జం రవి, సామంతపూడి గోవిందరాజు(చిన్నా), పట్టాభి రామరాజు, మానం వెంకటేశ్వరరావు, పెరుమాళ్ల జయకర్, గుండె సుందర్ పాల్, అంగిరేకుల విజయ్, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *