Breaking News

ప్రజా సమస్యల పరిష్కారానికి స్పందన ఒక అనువైన వేదిక.. జిల్లా కలెక్టర్‌

-వర్చువల్‌ విధానం ద్వారా ఆర్జీలను అక్కడకక్కడే పరిష్కారానికి చర్యలు
-జిల్లాలోని అన్ని మండల తహాశీల్థార్ల కార్యాలయం నుండి ప్రత్యక్ష అన్‌లైన్‌ వీడియోకాన్ఫరెన్స్‌
-స్పందనలో 122 ఆర్జీల నమోదు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో భాగంగా స్థానిక కలెక్టరేట్‌ స్పందన కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి స్పందన కార్యక్రమం అనువైన వేదికగా చేసుకుని ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తున్నారని, వాటిని తక్షణమే పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని మారుమూల గ్రామాల నుండి ప్రజలు ఎంతో నమ్మకంతో తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తారన్నారు. స్పందనలో పెట్టుకున్న ఆర్జీలను వెనువెంటనే పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఒక పర్యాయం పెట్టుకున్న ఆర్జీ మరల (రీ ఒపెన్‌) రాకుండా సాధ్యమైన మేరకు ఆయా సమస్యలను పరిష్కరింప చేయాలని ఆర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా ఆ సమస్యను పరిష్కరించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.
స్పందనలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు 48, మున్సిపల్‌ ఎడ్మినిట్రేషన్‌ అర్భన్‌ డెవలప్‌మెంట్‌ 15, పోలీస్‌ శాఖకు 11, విద్య శాఖ 8, పంచాయతీరాజ్‌ శాఖకు 7, సర్వే మరియు సెటిల్మింట్‌ ఆఫ్‌ ల్యాండ్‌ రికార్డు 5, మిగిలినవి వివిధ శాఖలక సంబందించి ఉన్నాయన్నారు.
స్పందనలో ప్రధానంగా నమోదు అయిన ఆర్జీలు గొల్లపూడి రామరాజ్య నగర్‌కు చెందిన జి. శ్రీనివాస్‌రావు ఆర్జీ ఇస్తూ తను కొనుగోలు చేసిన స్థలానికి 15 అడుగుల రోడ్డు ఉన్నట్లుగా రాసి ఇచ్చారని అయితే వారు ఇప్పడు ఆ రోడ్డును సగంపైగా అక్రమించి అడ్డంగా రోడ్డుపై నిర్మాణం జరిపారని అ నిర్మాణానిని తొలగించి తమకు న్యాయం చేయాలని కొరారు.
మైలవరం మండలానికి చెందిన అసైడ్‌ భూముల సాగుదారులు మరియు వారసులు ఆర్జీ ఇస్తూ తమ గ్రామంలో ప్రభుత్వం వారు భూ సీలింగ్‌ చట్టం ప్రకారం 1974 సంవత్సరంలో 75 ఎకరాల భూమిని 70 మందికి పంపిణీ చేయడం జరిగిందని అటవీ ప్రాంతంగా ఉన్న ఆ భూమిని కష్టనష్టాలకు ఓర్చి సాగు చేసుకుంటుండగా 1984 సంవత్సరంలో తమ భూములను కొందరు భూసాములు అక్రమించి పట్టాలను పాస్‌ పుస్తకాలను తీసుకున్నారని వాటిని తిరిగి ఇప్పించవలసిందిగా కొరారు.
నగరంలోని 5వ నెంబర్‌ రోడ్డులో ఐవిప్యాలస్‌ పక్క సందులో రహదారిపై కార్లను రీపెర్లు చేస్తూ కోర్టు వైపుకు వెళ్లెరోడ్డును కార్లతో పూర్తిగా మూసివేయడం జరుగుతుందని ఎన్‌హెచ్‌ఆర్‌సి అధ్యక్ష, కార్యదర్శి, కో`ఆర్డినేటర్‌ ఆర్జీని సమర్పించారు. కార్యక్రమంలో డిఆర్‌వో కె.మోహన్‌కుమార్‌, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌ జె. సునీత వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *