విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హనుమాన్ పేట నందలి వెహికల్ డిపో నందు చేపట్టి ఆధునీకరణ పనుల పురోగతిని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. డిపో ఆవరణలో రైల్వే కాంపౌండ్ వాల్ వద్దన గల టాయిలెట్స్ అక్కడ నుండి తొలగించి డిపో వెనుక బాగంలో నిర్మించాలని మరియు మెకానికల్ షెడ్ ముందు రోడ్ ప్యాచ్ వర్క్స్ పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అదే విధంగా డిజిల్ ట్యాంక్ చుట్టూ ఉన్న వాల్ కు పెయింటింగ్ మరియు రైలింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వెహికల్ డిపో నందు గల డ్రెయిన్ పాడైన చోట్ల తగిన మరమ్మత్తులు నిర్వహించుట, స్టోర్ రూమ్ వెనుక గల గోడను తొలగించి డిపో మరియు రైల్వే స్టేడియం మద్యన కాంపౌండ్ గోడకు మరమ్మత్తులు చేపట్టి పెయింటింగ్ వేయాలని సూచించారు. అదే విధంగా వెహికల్ డిపో ఎంట్రన్స్ గేటు మద్యన డివైడర్ ఏర్పాటు చేయుటతో పాటుగా సి.సి. రోడ్ వెడల్పు పెంచాలని అన్నారు. పర్యటనలో ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్ కె.కోటేశ్వరరావు మరియు స్టోర్స్ ఇన్ ఛార్జ్ యోగేంద్ర పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News