పరిసరాలలో నీరు నిల్వ లేకుండా చూడాలి…


రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ఉండేశ్వరపురం గ్రామములో ఒక డెంగ్యూ కేసు నమోదు కావడంతో దానిని పరిశీలించుటకు జిల్లా మలేరియా అధికారి జి.వీర్రాజు మరియు మలేరియా సబ్ యూనిట్ అధికారి రాజు రావడం జరిగినది. ఆ డెంగ్యూ కేసు వివరాలను సీతానగరం PHC హెల్త్ సూపర్వైజర్ K. శ్రీనివాసరావు మలేరియా అధికారి కి వివరించుట జరిగినది. అనంతరం సబ్ యూనిట్ అధికారి రాజు  ఆ కేసు చుట్టుపక్కల పరిసరాలను, దోమల ఆవాస ప్రాంతాలను పరిశీలించుట జరిగినది. జిల్లా మలేరియా అధికారి స్థానిక ప్రజలతో ఉపయోగించని రుబ్బురోలు, పాత సీసాలు, జాడీలు , డిస్పోజబుల్ గ్లాసులు మొదలగు వాటిలో నీరు చేరి వాటిలో దోమలు వృద్ధి చెందుతాయని, వాటి వల్ల మలేరియా , డెంగ్యూ జ్వరాలు వస్తాయని వివరించుట జరిగినది. జులై నెల నుండి వర్షాలు ఎక్కువగా కురవడం వలన దోమలు బాగా వృద్ధి చెందుతాయని కాబట్టి పరిసరాలలో నీరు నిల్వ లేకుండా చూడాలని తెలియజేయుట జరిగినది. అనంతరం జిల్లా మలేరియా అధికారి  ANM మరియు MLHP ల రికార్డులను పరిశీలించి తగిన సూచనలను ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమానికి హెల్త్ సూపర్వైజర్ కే శ్రీనివాసరావు తో పాటుగా Health Assistants స్వామి ,B. రూప్ కుమార్, ANM లు M.పద్మ ,B.కుమారి, MLHPలు షేక్ మౌనిక, మరియు బి. శైలజ, MLHP లు, ఆశా కార్యకర్తలు మరియు ఉండేశ్వరపురం గ్రామపంచాయతీకి చెందిన విటల్ పాల్గొనుట జరిగినది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనకు ఐదు సంస్థలతో ఎంఓయూల మార్పిడి

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : కుప్పం మునిసిపాలిటీలోని కొత్తపేటలో ఏర్పాటు చేసిన డెవలప్‌మెంటల్ ప్రాజెక్ట్స్ అండ్ ఇనిషియేటివ్స్ గ్యాలరీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *