Breaking News

రూ.1.66 కోట్ల నిధులతో ఆధునికీకరించిన సర్ విజ్జీ స్విమ్మింగ్ పూల్ పున: ప్రారంభం


-క్రీడాకారులకు కల్పించిన మౌలిక వసతులను సక్రమముగా వినియోగించుకోవాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో రూ. 166.36 లక్షల నగరపాలక సంస్థ సాధారణ నిధులతో ఆధునీకరించిన గాంధీనగర్ నందలి శ్రీ సర్ విజ్జి(విజయ్ కుమార్ రాయ్), స్విమ్మింగ్ పూల్ ప్రారంభకార్యక్రమములో ప్రభుత్వ విప్ సామినేని ఉదయ భాను, సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు  మల్లాది విష్ణు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, గ్రందాలయ చైర్మన్ జమ్మల పూర్ణమ్మ, డిప్యూటీ మేయర్లు అవుతూ శ్రీశైలజారెడ్డి, బెల్లం దుర్గ మరియు స్థానిక కార్పొరేటర్ తో పాటుగా పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. స్విమ్మింగ్ పూల్ నందలి జిమ్ పరికరాలను పరిశీలించి, కాసేపు వ్యాయామం చేస్తూ ఉల్లాసంగా గడిపారు. అనంతరం క్రీడాకారుల మధ్య స్మిమ్మింగ్ పోటీలను జెండా ఊపి ప్రారంభించారు.

స్విమ్మర్లు అంతర్జాతీయ పోటీలలో రాణించేలా ప్రోత్సాహం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యానికి వ్యాయామం, స్విమ్మింగ్ ఎంతగానో తోడ్పడతాయని, కోవిడ్‌ నేపథ్యంలో మూతపడ్డ స్విమ్మింగ్‌ పూల్‌ ను రూ. 1.66 కోట్ల నిధులతో ఆధునికీకరించిన సర్ విజ్జీ స్విమ్మింగ్ పూల్‌ ను ఆధునీకరించి పున: ప్రారంభించి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమని శాసన సభ్యులు మల్లాది విష్ణు తెలిపారు. ఈ సందర్భంగా సర్ విజ్జీ స్విమ్మింగ్ పూల్ కు దశాబ్దాల ఘన చరిత్ర ఉందని.. 1977 లోనే పూల్ ప్రారంభమైందని గుర్తుచేశారు. నాటి నుంచి నేటి వరకు వేలాది మంది స్విమ్మింగ్‌ క్రీడాకారులు ఇక్కడ చక్కటి తర్ఫీదు పొంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించారని వెల్లడించారు. వారిని మరింత ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో క్రీడాకారులు రెగ్యులర్ ప్రాక్టీస్ ను కొనసాగించేందుకుగానూ మూతపడ్డ ఈత కొలనును వినియోగంలోకి తీసుకురావడం జరిగిందన్నారు. చిల్డ్రన్స్ పూల్, డైవింగ్ పూల్, కాంపిటీషన్ పూల్ ను పూర్తిగా అభివృద్ధి పరచడంతో పాటు గ్యాలరీలను కూడా రీమోడలింగ్ చేసినట్లు తెలిపారు. దీంతో పాటు సుందరీకరణ కోసం పూల్స్ చుట్టూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. జిమ్ ను కూడా ఆధునికీకరించడం జరిగిందన్నారు. స్విమ్మింగ్ పూల్ పరిరక్షణకు ప్రధాన గేటు ఏర్పాటుతో పాటు ప్రహరీని అందమైన చిత్రాలతో సుందరంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు.

ఆరోగ్యవంతమైన జీవితానికి వ్యాయామం, స్విమ్మింగ్ దోహదం: సామినేని ఉదయభాను
ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆకాంక్ష అని తెలిపారు. ఇందులో భాగంగా నగరంలో పార్కుల అభివృద్ధికి, వాకింగ్ ట్రాక్ ల నిర్మాణాలకు ఈ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు వివరించారు.

క్రీడాకారులు సద్వినియోగ పరచుకోవాలి : నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నగరపాలక సంస్థ ద్వారా అన్ని వసతులతో ఆధునీకరించిన ఈ స్విమ్మింగ్ పూల్ నందలి సదుపాయాలను సక్రమముగా సద్వినియోగపరచుకోవాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో చక్కటి ప్రతిభను కనబరుస్తున్న స్విమ్మర్లు విజయవాడ నగరంలో అనేక మంది ఉన్నారన్నారు. అటువంటి స్విమ్మర్లను మరింత మందిని తయారు చేసేందుకు.. ఈ స్విమ్మింగ్ పూల్ ఎంతగానో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్ వి. శ్రీనివాస్, డిప్యూటీ ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్ గురునాథం, కార్పొరేటర్లు బాలి గోవింద్, జానారెడ్డి, కోఆప్షన్ సభ్యులు అలీమ్ మరియు ఇతర అధికారులు, క్రీడాకారులకు స్థానికులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *