Breaking News

కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చెయ్యాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత మహారాష్ట్ర లో అధిక వర్షాలు నేపథ్యంలో రాష్ట్ర విపత్తు ల నిర్వహణ సంస్థ వరదలు వొచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చెయ్యాలి.  ఆర్డీవో కార్యాలయంలో 24 గంటలు కంట్రోల్ రూం ఏర్పాటు చేసి 24 గంటలు షిఫ్ట్ ల విధానంలో సిబ్బంది నియమించాలి ఖచ్చితంగా ఆయా షిఫ్టు లో ఒకరిని నియమించాలి. తహశీల్దార్లు అందుకు తగిన విధంగా సిద్దంగా ఉండాలి. వి ఆర్ వో లు, పంచాయతీ కార్యదర్శులు, వాలంటీర్లు వారి వారి పరిధిలో లోతట్టు ప్రాంతాల పై అవగాహన కలిగి ఉన్న దృష్ట్యా అక్కడ చేపట్టవలసిన ముందస్తు చర్యలతో సిద్దంగా ఉండాలి , తహశీల్దార్లు ఆయా చోట్ల వారిని అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. వరద ప్రమాదం లేదని స్పష్టత వచ్చే వరకు ఎలార్ట్ గా ఉంచాలి. ముఖ్యంగా ఏయే ప్రాంతాల్లో ఫ్లాష్ వరదలు వచ్చే ప్రమాదం ఉంటుంది. పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ శాఖలు రహదారుల పరిస్థితి, ఎక్కడైనా బ్రీచ్ పడే అవకాశాలు ఉన్నా ప్రాంతాలను గుర్తించి, ఆయా చోట్ల రక్షణ చర్యలు తీసుకోవాలి. రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలి వారిని అప్రమత్తం చెయ్యాలి. విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరా లో ఆటంకాలు లేకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి.. విద్యుత్తు ప్రమాదాలకు తావులేకుండా తగిన చర్యలు చేపట్టాలి. వ్యవసాయ, మత్స్య శాఖ , ఉద్యాన శాఖ ఇప్పుడే పంటలు వేస్తున్న దృష్ట్యా వ్యవసాయంలో అంత ఇబ్బందికర పరిస్థితి ఉండక పోవచ్చు.. అయినా సరే రైతులను అప్రమత్తం చెయ్యలి. పండ్ల తోటల విషయంలో తగిన విధంగా రైతుల్లో తీసుకోవలసిన రక్షణ చర్యలు పై జాగ్రత్తలు అవసరం. మత్స్య సంపద విషయం, ఆక్వా కల్చర్ లను హెచ్చరికలు జారీ చేసి అప్రమత్తం చెయ్యండి. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలి.. అదే విధంగా సిజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలి. ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి, కలెక్టరేట్ కి రేపటికి నివేదిక అందజేయ్యాలి. మునిసిపల్, పంచాయతీల్లో శానిటేషన్ పై తక్షణ చర్యలు తీసుకోవాలి. ఈ అత్యవసర టెలి కాన్ఫరెన్స్ లో రాజమండ్రీ డివిజన్ లో సీతానగరం మండలంలో 2 వ ప్రమాద హెచ్చరికలు ఉంటే కొన్ని గ్రామాల్లో ముంపు ప్రమాదం ఉంటుంది. కొవ్వూరు మద్దురులంక పరిసర గ్రామాల్లో 3వ హెచ్చరికలు వొస్తే వాడపల్లి వద్ద అధిక వర్షం కురిసిన, వరదలు వచ్చే సమయంలో గట్టు తెగిన సందర్భం ఉందని ఆర్డీవో కొవ్వూరు వారు కలెక్టర్ కి వివరించారు. అధిక వర్షాలు, వరద కలిసి వొస్తే రాజమండ్రి నగరంలో ఆర్యపురం, సీతం పేట ముంపునకు గురి అయ్యే అవకాశం ఉందని తెలిపారు. కొవ్వూరు డివిజన్ లో ఎఱ్ఱకాలువ, గోకవరం బురద కాలవ వద్ద ఫ్లాష్ ఫ్లడ్స్ వొచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వరద ప్రమాద హెచ్చరికలు ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులు సూచనలు చెయ్యడం జరుగుతుందని, అందుకు అనుగుణంగా ఆర్డీవోలు తహశీల్దార్లు, ఎమ్ పి డి వో లను సమన్వయము చేసుకోవాలి. మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి పర్యవేక్షణ కోసం 24 గంటలు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటామని కమిషనర్ దినేష్ కుమార్ తెలిపారు. ఈవిధమైన సమాచార లోపం లేకుండా చర్యలు తీసుకోవాలి, ఎప్పటికప్పుడు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులతో సంప్రదించి , వారు జారీ చేసే హెచ్చరికలు క్షేత్ర స్థాయి అధికారులకు చేరేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి కి కలెక్టర్ మాధవీలత సూచనలు జారీ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *