విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జనవాణి జనసేన భరోసాకు వినతులు వెల్లువెత్తాయఅని జోరు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా పవన్ కళ్యాణ్ గారికి బాధితులు వినతిపత్రాలు సమర్పించారు అంటే సామాన్యుల కష్టాలు జగన్ పాలనలో ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చుఅని, వైసీపీ ప్రభుత్వానికి హృదయమే కాదు సామాన్యుల సమస్యలు వినడానికి ,చూడడానికి కళ్ళు చెవులు కూడా లేవని , జనసేన నాయకులు కార్యకర్తలు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి పూలతో ఘన స్వాగతం పలుకుదాం అనుకుంటే విజయవాడ నగరం పవన్ కళ్యాణ్ కి సమస్యలతో స్వాగతం పలికిందని ప్రజా సమస్యలు విని, పోరాడి పరిష్కరించడానికి నేనున్నానని సామాన్య ప్రజలకు భరోసా కల్పిస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ ని , జనవాణి కార్యక్రమం ద్వారా 1200 పైగా వినతి పత్రాలు వచ్చాయంటేనే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏవిధంగా ఉందో ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, జగన్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జనవాణి జనసేన భరోసా ద్వారా స్వీకరించిన వినతి పత్రానికి స్పందించి, పరిష్కారం చూపించాలని డిమాండ్ చేస్తున్నామని, జగన్ అసమర్ధ,దరిద్రమైన పరిపాలనకు కాలం చెల్లిందని,వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ కోసం వాలంటరీలను డ్వాక్రా మహిళలను అధికారులను బస్సుల్లో తరలించారని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, పెయిడ్ ఆర్టిస్టుల తో ప్లీనరీ సాగిందని ఈటింగ్ అవగానే మీటింగ్ ఖాళీ అయిపోయిందని , జగన్ ముగింపు ప్రసంగం కి ఖాళీ ఖర్చులు మిగిలాయని, దీని ద్వారా ప్రజా వ్యతిరేకత ఎంత ఉందో అర్ధమైపోతుందని, జగన్ కష్ట కాలంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి షర్మిల పార్టీ నిలబెట్టారని అలాంటి షర్మిల ని ఇంటినుంచి వెళ్ళగొట్టారని, అమ్మ బిజీ అమ్మతో బలవంతపు రాజీనామా చేయించారని, జగన్ కి మహిళా సాధికారకత గురించి మాట్లాడే నైతికత లేదని,మహిళా సాధికారత అంటే తల్లిని చెల్లిని మోసం చేయడమా అని వైసీపీ శ్రేణులు సీఎం జగన్ ను ప్రశ్నించాలని అన్నారు.
Prajavartha Online Telugu News