Breaking News

కోవిడ్‌ నిబంధనలను పాటించడంలో అలసత్వం వద్దు…

-మాస్క్‌, శానిటైజర్లను తప్పనిసరిగా వినియోగించాలి…
-జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్‌ వైరస్‌ నాల్గవదశలో చాపకింద నీరులా విస్తరిస్తున్న తరుణంలో ప్రజలు కోవిడ్‌ నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకోవాలని కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోని వారిని గుర్తించి వ్యాక్సిన్‌ అందించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ యస్‌. డిల్లీరావు తెలిపారు.
నాల్గవదశలో కోవిడ్‌ వైరస్‌ నివారణకు చేపట్టవలసిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ డిల్లీరావు, నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌ సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ నాల్గవదశలో కోవిడ్‌ వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తుందని అన్నారు. జిల్లాలో దాదాపు 90 శాతం మందికిపైగా ప్రజలకు రెండు డోసుల కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందజేయడం వలన వైరస్‌ను నియంత్రించగలిగామన్నారు. అయినప్పటికి కోవిడ్‌ వైరస్‌ నాల్గవదశలో కోవిడ్‌ బారిన పడిన కేసులు నానాటికి పెరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం కోవిడ్‌ బారిన పడిన ఏడుగురు విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆసుప్రతిలో చికిత్స పొందుతున్నారన్నారు. గుండె జబ్బులు, రక్తపోటు, షుగర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాదపడేవారు కోవిడ్‌ వైరస్‌ బారిన పడితే ప్రాణాపాయ పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. వైరస్‌ వ్యాధి నియంత్రణలో ప్రజలను అప్రమత్తం చేయవలసిన అవసరం ఉందన్నారు. షాపింగ్‌ మాల్స్‌, రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌, సినిమా థియేటర్స్‌, ఎగ్జిబిషన్‌లు పార్థనా మందిరాలు వంటి రద్దీ ప్రాంతాలలో మాస్క్‌ ధరించడం, శానిటైజర్‌ తప్పనిసరి చేయాలని కలెక్టర్‌ తెలిపారు. గత కోవిడ్‌ సమయంలో ప్రజలు ఎటువంటి నిబంధనలు పాటించారో అవే నిబంధనలు నిరంతరం పాటించేలా పర్యవేక్షించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. గతంలో 24 గంటలు అర్టిపిసిఆర్‌ వైరస్‌ నిర్థారణ పరీక్షలు నిర్వహించడం జరిగేదని ప్రస్తుతం 8 గంటలు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారని అవసరమైతే వైరస్‌ నిర్థారణ పరీక్షల సమయం పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కోవిడ్‌ వ్యాధిగ్రస్థులకు చికిత్సలు అందించేందుకు అన్ని వేళల సిద్దంగా ఉండాలని వైద్య అధికారులకు జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు సూచించారు.
సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నూపూర్‌ అజయ్‌, డిఆర్‌వో కె.మోహన్‌కుమార్‌, డియంహెచ్‌వో డా.యం. సుహసిని, డిప్యూటి డియంహెచ్‌వో డా. సౌభాగ్యలక్ష్మి వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *