-జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కుటుంబ నియంత్రణ పద్దతులు పాటించడం ద్వారా నూతన అధ్యాయానికి నాంది పలికి దేశ పురోగతికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అన్నారు.
ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, శాసనసభ్యులు మల్లాది విష్ణువర్థన్‌లతో కలిసి జనాభా నియంత్రణలో ఉత్తమ సేవలందించిన వారికి ప్రోత్సహక బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాను నియంత్రించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అదే సమయంలో మానవ వనరుల సమతుల్యం పాటించాలన్నారు. పరిమిత కుటుంబం భావితరాలకు సహజ వనరులను అందించేందుకు దేశ పురోగతికి దోహదపడుతుందన్నారు. వనరుల అన్నిటిలోను మానవ వనరు అసాదారణమైనదన్నారు. ప్రకృతి వైపరిత్యాలను అడ్డంకులు, అటంకాలను ఎదుర్కొన్ని అప్రహితంగా మనుగడను కొనసాగుతుందన్నారు. మానవ వనరులను సంరక్షించుకుంటు కుటుంబ నియంత్రణను పాటించేందుకు జనాభా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు.1950 సంవత్సరంలో దేశంలో జనగణన ప్రారంభమైయిందని ఇప్పటివరకు ఏడు సార్లు జనాభా గణన జరిగిందన్నారు. గత ఏడాది జనాభా గణన జరగాల్సిఉన్నప్పటికి కోవిడ్ కారణంగా వాయిద పడిరదన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 8 కోట్ల 53 లక్షలు కాగా ప్రపంచ జనాభా 8 బిలియన్‌లకు పెరిగిందన్నారు. జనాభా లెక్కల ప్రకారం ప్రపంచంలోనే భారతదేశం ద్వితియ స్థానంలో ఉందని ఇందుకు తగిన విధంగా పెరుగుతున్న జనాభా దృష్టిలో పెట్టుకుని కుటుంబ నియంత్రణను పాటించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ అధిక జనాభా వలన కలిగే నష్టాలపై ప్రజలలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కుటుంబ నియంత్రణ పద్దతులను పాటించే వారిని ప్రోత్సహించవలసిన అవసరం ఉందన్నారు. శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్ మాట్లాడుతూ తక్కువ జనాభాతోనే అభివృద్ధి సాధ్యాపడుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వలన చాలా వరకు జనాభా పెరుగుదలను నియంత్రించగలిగామన్నారు.
ఈ సందర్భంగా కుటుంబ పిపిఐ యుసిడి వేయించుకున్నవారిలో లక్కీడీప్ ద్వారా ఎంపికైన జి. మధవి, మాణిక్యాల రావు దంపతులకు 10 వేల రూపాయలు అంతర్ ఇంజక్షన్ చేయించుకున్న వారిలో లక్కీడీప్ ద్వారా ఎంపికైన పి. వరలక్ష్మి శ్రీనివాస దంపతులకు 10 వేల రూపాయలను శస్త్రచికిత్సలలో ఉత్తమ సేవలందించిన ఆశ కార్యకర్త, ఏఎన్‌యం, కౌన్సలర్‌లకు, వ్యాసరచణ పోటీలలో విజేతలైన విద్యార్థిని విద్యార్థులకు నగదు ప్రోత్సహకాల సర్టిఫికేట్లను అందజేసి అనంతరం కుటుంబ నియంత్రణ పద్దతులపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్లను కలెక్టర్ డిల్లీరావు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌లు విడుదల చేశారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ నూపూర్ అజయ్ కుమార్, ఆర్‌డివో కె.మోహన్‌కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. యం సుహసిని వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News