-స్పందనలో 96 ఆర్జీల నమోదు..
-జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కారార్థం ఏర్పాటు చేసిన ‘‘స్పందన’’ కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ స్పందన హాల్ నుండి ప్రజల ఫిర్యాదులను స్పందన కార్యక్రమంలో స్వీకరించారు. ఈ కార్యక్రమానికి జిల్లాకలెక్టర్ ఎస్ డిల్లీరావుతో పాటు జాయింట్ కలెక్టర్ ఎస్ నూపూర్ అజయ్ కుమార్, డిఆర్వో కె.మోహన్‌కుమార్ హాజరై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో 92 ఆర్జీలను స్వీకరించామన్నారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. ఆర్జీదారుడు సంతృప్తిచెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా ఆర్జీలు పరిష్కారం కావాలన్నారు. పెండిరగ్ బియాండ్ ఎస్ఎస్ఏ రీ ఓపెన్ కాకుండా ఆర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
స్పందనలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు 38, మున్సిపల్ ఎడ్మినిట్రేషన్ అర్భన్ డెవలప్మెంట్ 7, పోలీస్ శాఖకు.13, వ్యవసాయ 14, మిగిలినవి వివిధ శాఖలకు 24 సంబంధించినవి ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ నూపూర్ అజయ్ కుమార్, డిఆర్వో కె.మోహన్‌కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.
Prajavartha Online Telugu News