-పేదలు చిరు వ్యాపారస్తులకు అందుబాటు ధరలో ఎల్పిజి గ్యాస్ సిలిండర్…
-జాయింట్ కలెక్టర్ నూపూర్ అజయ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలు చిరు వ్యాపారస్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఐదు కేజిల ఎల్పిజి గ్యాస్ సిలిండర్లను రేషన్ దుకాణాల ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ నూపూర్ అజయ్ అన్నారు.
రేషన్ దుకాణాలలో ఐదు కేజిల ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ఏర్పాటుపై గ్యాస్ కంపెనీల ప్రతినిధులు పౌరసరఫరాలు, రేషన్ దుకాణాల డీలర్లతో సోమవారం జాయింట్ కలెక్టర్ నూపూర్ అజయ్ కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ అనదికారంగా ఎల్పిజి గ్యాస్‌ను 5 కెజిల గ్యాస్ సిలిండర్లలో నింపి వినియోగదారులనుండి అధిక ధరలకు వసూలు చేస్తున్నారన్నారు. దీనిని వివారించేందుకు వినియోగదారుల ప్రయోజనాలతో పాటు రేషన్ డీలర్లకు కమీషన్‌రూపంలో ఆదాయం లభించేందుకు 5 కేజిల ఎల్పిజి గ్యాస్ సిలిండర్ రేషన్ దుకాణాలద్వారా సరఫరా చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. 5 కేజిల ఎల్పిజి గ్యాస్ సిలిండర్లకు అవసరమైన వారు గ్యాస్ కనక్షన్తీసుకోవాల్సిన అవసరం లేదని ఒక సారి సిలిండర్ గ్యాస్ కలిసి 1803 రూపాయలు చెల్లించి, 5 కేజిల ఎల్పిజి గ్యాస్ సిలిండర్‌ను పొందవచ్చునన్నారు. ఎప్పటికప్పుడు 5 కేజిల గ్యాస్‌కు మాత్రం 639 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందన్నారు. ఒకోక్క 5 కేజిల గ్యాస్ అమ్మకంపై రేషన్ దుకాణాదారుడికి ఆయిల్ కంపెనీ యాజమాన్యం 106 రూపాయల కమీషన్‌రూపంలో చెల్లిస్తున్నారన్నారు. ఒక్కోక్క రేషన్ దుకాణంలో 20 చిన్న గ్యాస్ సిలిండర్ల నిల్వ పెట్టుకుని వ్యాపారం చేసుకునేందుకు అనుమతి ఇస్తామన్నారు. రేషన్ దుకాణాల ద్వారా సిలిండర్లను సరఫరా చేయడం వలన వినియోగదారులకు సమీపంలోనే అందుబాటులో ఉంటాయన్నారు. వినియోగదారులకు గ్యాస్ కంపెనీల నుండి నేరుగా రేషన్ దుకాణాలకు 5 కేజిల ఎల్పిజి గ్యాస్ సిలిండర్లను సరఫరా చేసేలా రేషన్ డీలర్లతో అవగాహన ఒప్పందం చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. రేషన్ దుకాణాల డీలర్లు గ్యాస్ కంపెనీలు నిర్థేశించిన రేట్లకే రేషన్ దుకాణాదారులకు పంపిణీ చేసి వినియోగదారులకు 5 కెేజిల గ్యాస్ సిలిండర్లు అంబాటులో ఉంచేలా చర్యలు తీసుకుకోవాలని జాయింట్ కలెక్టర్ నూపూర్ అజయ్ అన్నారు.
సమావేశంలో డిఎస్వో పి. కోమలిపద్మ, హెచ్‌పిసిఎల్ డిజియం మేనేజర్ జిఎల్యం నాయుడు, రేషన్ డీల్లర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యం.వెంకటరావు, జిల్లా అధ్యక్షులు యం శేషగిరిరావు, ప్రధాన కార్యదర్శి పి శివప్రసాద్, రేషన్ డీలర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News