Breaking News

ఆర్థిక సహాయం అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల తూర్పు నియోజకవర్గ పరిధిలోని 16వ డివిజన్,వడ్రోలు బజారులో ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పర్యటించినప్పుడు నలుగురు ఆడపిల్లలు కలిగిన ఒంటరి మహిళా తురక జ్యోతి జీవనోపాధికి ఇబ్బందులు పడుతున్న విషయం అవినాష్ దృష్టికి తీసుకురాగా ఆదివారం నాడు వారికి ‘దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా 10వేల రూపాయల ఆర్థిక సహాయం చేసారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ నాన్నగారు దేవినేని నెహ్రు గారి సేవా స్పూర్తితో మా చారిటీ సంస్థ ద్వారా ఎన్నో వేల మందికి ఉపాధి, విద్య రంగాలలో అండగా నిలుస్తున్నాం అని అన్నారు .రాబోయే రోజుల్లో కూడా మా సేవా కార్యక్రమాలు ఇలాగే నిరాటంకంగా జరుపుతామని నా పూర్తి సహాయసహకారాలు ఉంటాయని అవినాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,మాజీ కార్పొరేటర్,సీనియర్ నాయకులు ఉమ్మడిశెట్టి బహదూర్,బచ్చు మాదవి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *