Breaking News

విజయవాడ పశ్చిమలో ఉన్నామా లేక పల్లెలో ఉన్నామ?

-రోడ్ల అధ్వాన్న పరిస్థితిని CM జగన్ ని నిద్రలేపెందుకే గుడ్ మార్నింగ్ సీఎం సార్ ప్రోగ్రాం.
-గోతులు పడ్డ రోడ్లలో మొక్కలు నాటి నిరసన.
-పశ్చిమ పరిధిలో ఉన్న కార్పొరేషన్ రోడ్లన్నీ అధ్వానం.
-ప్రజలు వైఎస్ఆర్సిపి కి ఒక్క అవకాశం ఇచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
43 వ డివిజన్ ఊర్మిళ నగర్, చర్చిరోడ్డు లో, రోడ్ల దుస్థితి పై శుక్రవారం గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమంలో జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ పాల్గొన్నారు. ఊర్మిళ నగర్ పార్క్ రోడ్ లో అద్వానంగా ఉన్న గోతులు పడ్డ రోడ్లలో మొక్కలు నాటి వినూత్నంగా మహేష్ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి నిరసన ప్రదర్శన తెలియజేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నమో మారుమూల ప్రాంతంలో ఉన్నామో అర్థంకాని పరిస్థితిలో ప్రజలు ఉన్నారని, ఊర్మిళ నగర్ లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని నిద్రలేపి వాస్తవ పరిస్థితిని తెలియజేసేందుకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలియజేయడానికి ఈ డిజిటల్ క్యాంపైన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మరమ్మతుల కోసం అప్పుగా తెచ్చిన రెండు వేల కోట్ల రూపాయల పై సీఎం జగన్ సమాధానం చెప్పాలని, జూలై 15 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై పై గోతులు లేకుండా అన్ని చోట్ల మరమ్మతులు చేస్తామని ఆర్భాటపు ప్రకటనలు చేసిన CM  నేడు రోడ్ల దుస్థితి పై స్పందించాలని, విజయవాడ నగర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆరు వందల కోట్ల రూపాయలు కేటాయించారని పదేపదే మాట్లాడుతున్నా ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్, మేయర్  విజయవాడ నగర రోడ్ల అభివృద్ధి కోసం కనీసం 60 లక్షల రూపాయలు కూడా ఖర్చు చేయలేక పోయారని ఇది వారి అసమర్ధతకు నిదర్శనమని, అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో 12కు పైగా డివిజన్ల కొండ ప్రాంతం లోనే ఉన్నాయని మెట్ల మార్గాలు పూర్తిగా దెబ్బతిని సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అయినా కొండ ప్రాంతాల అభివృద్ధి కోసం సరైన చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందారని, ఇటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు వల్ల ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రాబోయే ఎన్నికల్లో వీరికి తగిన బుద్ధి చెప్పాలని, పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా సమస్యలు పై నిత్యం స్పందిస్తూ వారికి అండగా నిలబడుతుంది జనసేన పార్టీ తరఫున మహేష్ మాత్రమే నని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాకిన.శ్రీనివాస్, శివయాదవ్, శ్రీదేవి, మల్లెపువిజయలక్ష్మి, బొమ్ము.రాంబాబు, బావిశెట్టి.శ్రీనివాస్, సానివరపు.శివ, కొరగంజి.రమణ, పొట్నూరి.శ్రీనివాస్,స్టాలిన్, రాజు, నల్లబెల్లి.కనకరావు, అఖిల్ విజయ కుమారి, పాల.రజని తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *