విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో అర్హులైన 13,979 మంది ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లకు వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా 13 కోట్ల 97 లక్ష 90 వేల రూపాయల లబ్ది చేకూర్చడం జరిగిందని జిల్లా జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా అర్హులైన డ్రైవర్లకు ఒక్కొక్కరికి 10వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని విశాఖపట్నంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బట్టన్ నొక్కి డ్రైవర్ల ఖాతాలలో ఆర్థిక సహాయాన్ని జమ చేశారు.
ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, శాసన సభ్యులు మల్లాదివిష్ణువర్థన్, డిటిసి యం.పురేంద్ర తదితరులు ప్రత్యక్ష ప్రచారం ద్వారా విక్షించిన అనంతరం జిల్లలో చెందిన లబ్దిదారులకు సంబంధించిన 13 కోట్ల 97 లక్ష 90 వేల రూపాయలను చెక్‌ను డ్రైవర్లకు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది వాహన మిత్ర పథకం ద్వారా 4,947 మంది ధరఖాస్తు చేసుకోగా వీరిలో అర్హులైన 13,979 మందికి డ్రైవర్లకు రూ.13,97,90,000 వారి ఖాతాలలో జమ చేయడం జరిగిందన్నారు. వీరిలో 23 మంది బ్రాహ్మణ, 267 మంది మైనారిటీ, 26 మంది క్రిస్టియన్ మైనారిటి, 448 మంది ఇబిసి, 1408 మంది కాపు, 4030 మంది ఎస్సీ, 656 మంది ఎస్టీ, 349 మంది రెడ్డి, 302 మంది కమ్మ, 25 మంది ఆర్యవైశ్య, 9 మంది క్షత్రియ వర్గాలకు చెందిన వారు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సహయాన్ని సద్వినియోగం చేసుకుని కుటుంబాలను ఆర్థిక బలోపేతం చేసుకోవాలన్నారు. ఆటో, క్యాబ్‌లలో ప్రయాణికుల పట్ల గౌరవంగా ప్రవర్తించి జిల్లాకి మంచి పేరు తేవాలని జిల్లా కలెక్టర్ డ్రైవర్లకు సూచించారు.
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ జగనన్న పాదయాత్రలో డ్రైవర్ల కష్టాలను గుర్తించి ‘‘నేను వినాను..నేను ఉన్నాను’’అని బరోసా ఇచ్చిన విధంగా ఒక్కొక్క డ్రైవర్‌కు సంవత్సరానికి 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నారన్నారు. ఆటో క్యాబ్ డ్రైవర్ల ఆర్థిక కష్టాలలో పాలుపంచుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి అండగా ఉండాలన్నారు.
శాసన సభ్యులు మల్లాది విష్ణు వర్థన్ మాట్లాడుతూ లక్షలాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే బాధ్యతలను మోస్తూ బ్రతుకు గడవడానికి కష్టంగా ఉన్న ఆటోడ్రైవర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నగా హక్కున చేర్చుకున్నారన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా సొంత వాహనం కలిగిన ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు అండగా ఉండాలని ప్రతి ఎటా 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రిగా పదవీ చేపట్టిననాటినుండి ఇప్పటి వరకు ఒక్కోక్కరు 40 వేల రూపాయల లబ్ది పొందన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నపట్టికి వాహన మిత్ర పథకాన్ని కొనసాగిస్తున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతులుగా ఉండాలన్నారు.
కార్యక్రమంలో ట్రాన్‌పోర్టు అధికారులు వాహన మిత్ర లబ్దిదారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News