Breaking News

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నగరపాలక సంస్థ మలేరియా విభాగం యాంటి లార్వా ఆపరేషన్స్ సచివాలయాల వారీగా చేపడుతుందని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ తెలిపారు. బుధవారం కమిషనర్ బృందావన్ గార్డెన్స్ లోని మలేరియా శానిటరీ డివిజన్ కార్యాలయంలో ఆయిల్ బాల్స్ తయారిని తనిఖీ చేసి, బృందావన్ మెయిన్ రోడ్, గుజ్జనగుండ్ల సెంటర్ తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించి ప్రజారోగ్య అధికారులకు తగు ఆదేశాలు జారి చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత మలేరియా శానిటరీ డివిజన్ కార్యాలయంలో ఆయిల్ బాల్స్ తయారిని పరిశీలించి, బయాలజిస్ట్, మలేరియా సిబ్బందితో మాట్లాడుతూ ఆయిల్ బాల్స్ ప్రతి డివిజన్ కార్యాలయంలో సిద్దం చేయాలన్నారు. నగరంలో మలేరియా, డెంగ్యూ కేసులు నమోదు కాకుండా నగరపాలక సంస్థ నుండి తీసుకోవాల్సిన చర్యలు యుద్ద ప్రాతిపదికన చేపట్టాలన్నారు. సచివాలయాల వారీగా శానిటేషన్ కార్యదర్శి, ఏఎన్ఎం, వాలంటీర్లు ఇంటింటికి సంయుక్తంగా తిరిగి సీజనల్ వ్యాధుల పై ప్రజలకు అవగాహన కల్గిస్తూ, ఎక్కువ కాలం నీరు నిల్వ ఉంచే గాబులు, ట్యాంక్ లు, టైర్లు, కుండీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని తెలియచేయాలన్నారు. మలేరియా సిబ్బంది గుర్తించిన ఖాళీ స్థలాల్లో ఆయిల్ బాల్స్ వేయడం, గంబుషియా చేపలు వదలడం, యాంటి లార్వా ఆపరేషన్స్ చేపట్టాలన్నారు. కేసులు నమోదు అయిన ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పారిశుధ్య పనుల్లో ఎక్కడా లోపం జరగకూడదని, రోడ్ల మీద చెత్త కుప్పలు ఉంటే సంబందిత సచివాలయ కార్యదర్శులదే భాద్యత అని, శానిటరీ ఇన్స్పెక్టర్లు పర్యవేక్షణ చేయాలన్నారు. ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరగాలని స్పష్టం చేశారు. ప్రజలనుద్దేశించి కమిషనర్ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం డ్రైడే పాటించి, ఇంటి లోపల, పరిసరాల్లో నీటి నిల్వల్ని ఖాళీ చేసి, దోమల లార్వా నియంత్రణకు సహకరించాలన్నారు. అలాగే ఓవర్ హెడ్ ట్యాంక్ లు, సంపుల్లో దోమలు చేరకుండా మూతలు ఏర్పాటు చేసుకోవాలని, ఖాళీ స్థలాలను మెరక చేసుకొని, పిచ్చి మొక్కలను తొలగించుకోవాలని సూచించారు. పర్యటనలో సి.ఎం.ఓ.హెచ్. డాక్టర్ విజయలక్ష్మీ, బయాలాజిస్ట్ మధుసూదన్ రావు, ఎస్.ఎస్. రాంబాబు, శానిటరీ ఇన్సెపెక్టర్ ప్రసాద్, సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *