Breaking News

ఆర్థిక సహాయం అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజకీయాలకు అతీతంగా కులమత బేధాలు లేకుండా ఆపదలో ఉన్న నిరుపేదలకు విద్య, ఉపాధి కల్పన కొరకు విజయవాడ నగరంలో చేపడుతున్నట్టు ట్రస్ట్ చైర్మన్ దేవినేని అవినాష్ అన్నారు. గత ఐదు సంవత్సరాలు నుండి ట్రస్టు తరఫున అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు దేవినేని నెహ్రూ ట్రస్ట్ ‌ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆదివారం తూర్పు నియోజకవర్గలోని 3వ డివిజన్ గంగిరెద్దుల దిబ్బ కి చెందిన కె.నీరజ్ జీవనోపాధి నిమిత్తం సెలూన్ షాప్ ఏర్పాటు చేసుకోవడానికి ‘దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా నగర మేయర్ భాగ్యలక్ష్మి,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, స్థానిక డివిజన్ ఇన్ ఛార్జ్ గల్లా పద్మావతి తో కలిసి 30000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ భవిష్యత్తు లో ఇలాగే అవసరమైన నిరుపేద కుటంబాలకు దేవినేని నెహ్రు ట్రస్ట్ ద్వారా సేవ కార్యక్రమాలు కొనసాగిస్తాం అన్నారు. .ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయి బ్రాహ్మణ డైరక్టర్ కనకారావు, కో ఆప్షన్ సభ్యులు ముసునూరి సుబ్బారావు, వైస్సార్సీపీ నాయకులు గల్లా రవి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *