విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదలుపెట్టిన ప్రతి పనిని శరవేగంగా పూర్తి చేస్తూ అభివృద్ధి లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారు అని తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ఆదివారం నాడు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ ఎన్టీర్ వెటర్నరీ కాలనీ లో దాదాపు 40లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో సీసీ రోడ్లు నగర మేయర్ భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, స్థానిక డివిజన్ ఇన్ ఛార్జ్ గల్లా పద్మావతి తో కలిసి శంకుస్థాపన చేసారు. అవినాష్ మాట్లాడుతూ ఇదే డివిజన్ లో దాదాపు కోటి 20లక్షల రూపాయల నిధులతో నిర్మాణలు పూర్తి చేసుకున్న పలు రోడ్లు ను ప్రారంభించి ప్రజలకు అందుబాటులో కి తీసుకొచ్చాం అని అన్నారు . 4వ డివిజన్లో ఉన్న అన్ని కాలనీ లలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్ళ కాలంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చొరవతో విజయవాడ నగరంలో ఏ డివిజన్లో లేని విదంగా 4వ డివిజన్ లోనే దాదాపు 9కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ, కార్పొరేటర్ ఉండి కూడా గత 5 సంవత్సరాలు ఈ డివిజిన్ అభివృద్ధి ని పట్టించుకోలేదు, వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసిన పనుల వద్ద ఫోటోలు దిగి వారి ఘనత గా ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటు అని విమర్శించారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో తూర్పు నియోజకవర్గం అబివృద్దికె నోచుకోలేదు మా జగన్మోహన్ రెడ్డి చొరవతో దాదాపు 350కోట్లు తో అభివృద్ధి చేసాం అన్నారు. తెలుగుదేశం పార్టీ చేసే అసత్య ప్రచారాలు ప్రజలు అంతా గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో మీకు గట్టిగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. జగన్ రాష్ట్రం అంతా సమ అభివృద్ధి చెందాలని ఓడిపోయిన సరే తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసారని, రాబోయే 30 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి గా ఉండాలని ప్రజలు అంత కోరుకొంటున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ మెంబెర్ ముసునూరు సుబ్బారావు, కార్పొరేటర్లు అంబేద్కర్, అమర్నాధ్, వెటర్నరీ కాలనీ ప్రెసిడెంట్ నల్లూరి సుబ్బారావు, ఎన్టీర్ కాలనీ ప్రెసిడెంట్ సుంకర రాజేష్, భయాన వెంకట్రావు, సుదర్శన్ రెడ్డి, వైస్సార్సీపీ నాయకులు గల్లా రవి,జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News