Breaking News

సీఎం వైఎస్ జగన్ పాలన మత్స్యకారులకు సువర్ణాధ్యాయం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏదైతే మత్స్యకారులకు తొక్కతీస్తా‌‌..తాడ తీస్తా..అని బెదిరించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుని వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో చిత్తుచిత్తుగా ఓడించేది ఒక మత్స్యకారుడే అని, సీఎం వైఎస్ జగన్ పాలన మత్స్యకారులకు ఓ సువర్ణ అధ్యాయమని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. విజయవాడలో శనివారం మినర్వా గ్రాండ్ హోటల్ లో నిర్వహిం చిన వైఎస్సార్సీపీ మత్స్యకార ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ మత్స్యకారులను అక్కున చేర్చుకుని, ఏదైతే తన సుధీర్ఘ ప్రజా ప్రస్థానం (పాదయాత్ర) సమయంలో ప్రతీ మత్స్యకారుని గుండె చప్పుడు తెలుసుకొని,నేడు ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ మత్స్యకారుని అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి ఈ మత్స్యకార  ప్రజా ప్రతినిధుల  ఆత్మీయ సమావేశంలో ప్రతీ మత్స్యకారుని తరుఫున కృతజ్ఞతలు తెలుపుకున్నారన్నారు.  వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలన మత్స్యకారులకు సువర్ణ అధ్యాయమని, గత ప్రభుత్వం హయాంలో భంగపడ్డ ప్రతీ మత్స్యకారుడిని అక్కున చేర్చుకుని ఎన్నో సంస్కరణలు, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత మన ముఖ్యమంత్రి దని ఆయన అన్నారు. మత్స్యకార  సామాజికవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులతో సమష్టి కార్యాచరణ కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, రాబోయే రోజుల్లో సామాజిక వర్గాన్ని వైసీపీకి మరింత చేరువ చేయుటలో మనందరం కలిసికట్టుగా పనిచేయాలన్నారు. దేశంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా తొలిసారి ఇంతమందికి చట్టసభల్లో అవకాశం కల్పించిన నాయకుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని శాశ్వత సీఎంగా ఉండేలా మనందరం కృషి చేయాలని ఆ దిశగా మత్స్యకార వర్గంలో చైతన్యం తేవాలని మంత్రి కోరారు. గత తెలుగుదేశం పార్టీ నాయకులుకు మన మత్స్యకారుల కష్టాలు పట్టేవి కాదని, అణచివేతకు గురయ్యేవారుమని, ఏదైతే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందో రాష్ట్రంలో 1,19,875 మ‌త్స్య‌కార కుటుంబాల‌కు ఆదుకునే ఘనత మన వైయస్సార్ కాంగ్రెసు పార్టీదని మంత్రి వివరించారు. తొలిసారి ఇంతమందికి చట్టసభల్లో అవకాశం కల్పించిన సీఎం జగన్ శాశ్వత సీఎంగా ఉండాలన్నారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు మరియు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇంచార్జి & ముమ్మిడివరం ఎమ్మెల్యే  పొన్నాడ వెంకట సతీష్ కుమార్  మత్స్యకార సామాజికవర్గ అభివృద్ధికి చేస్తున్న కృషికి కృతజ్ఞతలు తెలియజేశారు. అంతే కాకుండా ఈ సమావేశానికి హాజరైన ప్రతీ మత్స్యకారుడూ జాతి అభ్యున్నతికి పాటుపడిన వారేనని, ఇక్కడ ఒకరు ఎక్కువా..ఇంకొకరు తక్కువ కాదని, అందరం కలిసికట్టుగా పని చేయాలని ఏ మత్స్యకారుడుకి కష్టం వచ్చినా నా ఇంటి తలుపులు మీకోసం ఎల్లవేళలా తెరిచి ఉంటాయని మాట ఇచ్చారు. అనంతరం మత్స్యకార నాయకులకు, పెద్దలకు, కార్పొరేషన్ చైర్మన్ లకు, డైరెక్టర్లకు శాలువా కప్పి జ్ఞాపికతో మోపిదేవి వెంకటరమణ రావుతో కలిసి సత్కరించారు. ఈ  కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేఆర్ భరత్, మత్స్యకార కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *